ఆపరేషన్ చేసి మహిళ కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్.. 12 ఏళ్ల తర్వాత ఎలా తెలిసిందంటే?
చాలా మంది వైద్యులకు చూపించుకున్నప్పటికీ ఆమె నొప్పికిగల కారణాలను నిర్ధారించలేకపోయారు.

ఆపరేషన్ చేసి మహిళ కడుపులో కత్తెర మర్చిపోయాడు ఓ డాక్టర్. ఈ విషయం దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలిసింది. సిక్కింకు చెందిన ఓ మహిళ 2012లో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాతి నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది.
చాలా మంది వైద్యులకు చూపించుకున్నప్పటికీ ఆమె నొప్పికిగల కారణాలను నిర్ధారించలేకపోయారు. చివరకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది. 2012లో వైద్యుడు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన సమయంలో కత్తెరను ఆమె కడుపులోనే వదిలేసినట్లు ఇప్పుడు గుర్తించారు.
అప్పట్లో ఆమెకు గాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించానని ఆమె భర్త అన్నారు. అప్పటినుంచీ ఆమె కడుపులో నొప్పితో బాధపడుతూనే ఉందని వివరించారు. ఆమె కడుపునొప్పితో ఆసుపత్రులు తిరిగిందని, వైద్యులు ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపేవారని అన్నారు.
అక్టోబర్ 8న ఆమె మళ్లీ ఎస్టీఎన్‌ఎమ్ ఆసుపత్రికి వెళ్లిందని, ఎక్స్-రేలో ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు తేలిందని చెప్పారు. వైద్య బృందం వెంటనే శస్త్ర చికిత్స చేసి కత్తెరను తొలగించింది. ఆ మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
మీ బండారం బయటపెడతా..!- కేటీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..