సర్జరీ లేకుండానే సేఫ్: పళ్లు తోముతూ.. టూత్‌బ్రెష్ మింగేసింది

50ఏళ్ల మహిళ మాత్రం టూత్ పేస్ట్ అనుకొని ఏకంగా టూత్ బ్రెష్ నే మింగేసింది. అది కాస్త గొంతులోనుంచి నెమ్మదిగా పొట్టలోకి జారుకుంది. ఈ ఘటన గత జనవరిలో షిల్లాంగ్ లో జరిగింది

  • Published By: sreehari ,Published On : February 16, 2019 / 02:41 PM IST
సర్జరీ లేకుండానే సేఫ్: పళ్లు తోముతూ.. టూత్‌బ్రెష్ మింగేసింది

Updated On : February 16, 2019 / 2:41 PM IST

50ఏళ్ల మహిళ మాత్రం టూత్ పేస్ట్ అనుకొని ఏకంగా టూత్ బ్రెష్ నే మింగేసింది. అది కాస్త గొంతులోనుంచి నెమ్మదిగా పొట్టలోకి జారుకుంది. ఈ ఘటన గత జనవరిలో షిల్లాంగ్ లో జరిగింది

ఉదయాన్నే లేవగానే బ్రెష్ చేసుకోవడం అందరికి అలవాటు. అదేనండీ.. పళ్లు తోముకుంటారు. బ్రెష్ చేసే సమయంలో టూత్ పేస్ట్ టెస్ట్ బాగుంటుందని కొందరు నాకేస్తుంటారు. మరికొందరైతే మింగుతారు కూడా. కొంచెం ఉప్పగా.. తియ్యగా ఉండటంతో చిన్నపిల్లలైతే చప్పుడు కాకుండా మెల్లగా నాకేస్తారు. 50ఏళ్ల మహిళ నిద్రమత్తులో ఉందో ఏమో.. పొరపాటున పళ్లు తోముతూ ఏకంగా టూత్ బ్రెష్ నే మింగేసింది. అది కాస్త గొంతులోనుంచి నెమ్మదిగా పొట్టలోకి జారుకుంది.

మింగలేక కక్కలేక నరకయాతన పడింది. ఈ ఘటన మేఘాలయలోని షిల్లాంగ్ లో జరిగింది. దీంతో మహిళకు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయింది. వెంటనే మహిళ కుటుంబ సభ్యులు ఆమెను షిల్లాంగ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. లోయర్ మౌప్రేమ్ ప్రాంతానికి చెందిన మహిళ టూత్ బ్రెష్ మింగిన విషయం తెలిసి డాక్టర్లే షాక్ అయ్యారు. అదృష్టవశాత్తూ బాధిత మహిళకు ఎలాంటి సర్జరీ లేకుండానే కడుపులో నుంచి టూత్ బ్రెష్ ను తొలగించారు.
 

సర్జరీ అవసరం లేకుండానే ఎండోస్కోపీ ద్వారా వైద్యులు మహిళ కడుపులోని టూత్ బ్రెష్ ను నోటి నుంచి విజయవంతంగా బయటకు తీశారు. ఆపరేషన్ సక్సెస్ అయిన అనంతరం ఆస్పత్రి వైద్యులు ఇసాక్ సేయం మాట్లాడుతూ.. షిల్లాంగ్ లో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి. టూత్ బ్రెష్ మింగడమేంటి అని ఆశ్చర్యమేసింది. మహిళ కడుపులో నుంచి టూత్ బ్రెష్ ను తొలిగించాం.

ఎండోస్కోపీ ద్వారా బ్రెష్ ను బయటకు తీశాం. దీనికి ఎలాంటి సర్జరీ అవసరం లేదు. అర గంట తరువాత మహిళను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశాం’’అని తెలిపారు. పరిస్థితి అనుకూలించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకు రాకుంటే మాత్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి ఉండేదని, మహిళ ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని చెప్పారు.