365 కేసులను చేధించడానికి పోలీసులకు సాయపడిన రాఖీ ఇకలేదు, లాంఛనాలతో వీడ్కోలు

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 10:56 AM IST
365 కేసులను చేధించడానికి పోలీసులకు సాయపడిన రాఖీ ఇకలేదు, లాంఛనాలతో వీడ్కోలు

Updated On : August 17, 2020 / 11:57 AM IST

క్రిమినల్ కేసులను చేధించడానికి పోలీసులకు ఎంతో సాయపడిన రాకీ అనే శునకం కన్నుమూసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకీ ఆదివారం(ఆగస్టు 16,2020) ప్రాణాలు విడిచింది. మహారాష్ట్ర పోలీసులు ఆ శునకానికి గ్రాండ్ గా ఫేర్ వెల్ చెప్పారు. పోలీసు లాంచనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.



రాకీ, ఓ సాధారణ శునకం కాదు. చాలా ప్రత్యేకమైన జాగిలం. మహారాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా 365 కేసుల్లో పోలీసులకు సాయపడింది. వాటిని చేధించడంతో ప్రముఖ పాత్ర పోషించింది. రాఖీ సాయంతో పోలీసులు ఎన్నో కేసులను పరిష్కరించారు. దీంతో మహారాష్ట్ర పోలీసు శాఖలో రాకీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా, అనారోగ్యంతో రాకీ చనిపోవడం పోలీసులను బాధించింది. ఇక రాఖీ లేదనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో తమకున్న అనుబంధాన్ని పోలీసులు గుర్తు చేసుకున్నారు. దాన్ని సాహసిగా అభివర్ణించారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శునకమే అయినా రాకీతో ఎంతో అనుబంధం ఏర్పరచుకున్నారు.



పలు జాగిలాలకు పోలీసులు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. వాటిని డ్రగ్స్, పేలుడు పదార్దాలు గుర్తించేందుకు వాడతారు. కేసుల్లో ఆధారాలు గుర్తించడానికి, నిందితులను కనుగొనడానికి జాగిలాల సాయం తీసుకుంటారనే విషయం తెలిసిందే.