BCAS : దేశీయ విమానాల్లో.. వన్ హ్యాండ్‌‌బ్యాగ్ రూల్

సెక్యూర్టీ చెక్స్ కు అనుమతించే ముందే ఎయర్ లైన్స్ తమ ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగ్ ల విషయంలో తగిన సూచనలు చేయాలని...ఒన్ హ్యాండ్ బ్యాగ్ రూల్ గురించి అవగాహన కల్పించాలని

Domestic Passengers One Handbag : విమాన ప్రయాణం చేస్తున్నారా ? రెండు, మూడు హ్యాండ్ బ్యాగ్ లు తీసుకెళుతున్నారా ? అయితే..కేవలం ఒకే ఒక్క హ్యాండ్ బ్యాగ్ కు మాత్రమే అనుమతినిస్తారు. ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ లను తీసుకెళ్లడానికి ప్రయాణీకులను అనుమతించరని బీసీఏఎస్ ఉత్తర్వుల్లో పేర్కొంది. స్ర్కీనింగ్ పాయింట్స్ వద్ద పలు సమస్యలు ఎదురవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ (BCAS) ప్రకటించింది. దేశీ విమానాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.

Read More : Fake RTPCR Certificate : హైదరాబాద్ లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం

లేడీ బ్యాగ్ తో సహా సర్క్యులర్ ఇప్పటికే పొందుపరిచిన వస్తువులు కాకుండా ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ లను తీసుకెళ్లడానికి ప్రయాణీకులను అనుమతించరని తెలిపింది.
విమానాల్లోకి ఎక్కేముందు..వారి సామాగ్రీని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతారనే సంగతి తెలిసిందే. అయితే..రెండు నుంచి మూడు బ్యాగ్ లతో ప్రయాణీకులు వస్తుండడంతో స్క్రీన్ పాయింట్స్ వద్ద జాప్యం చోటు చేసుకొంటోంది. దీనివల్ల ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతోంది.

Read More : Gudiwada Casino : గుడివాడలో క్యాసినో వివాదం.. ఈడీ విచారణకు టీడీపీ డిమాండ్

ఈ క్రమంలో నూతన నిబంధన ముందుకు తీసుకొచ్చింది. సెక్యూర్టీ చెక్స్ కు అనుమతించే ముందే ఎయర్ లైన్స్ తమ ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగ్ ల విషయంలో తగిన సూచనలు చేయాలని…ఒన్ హ్యాండ్ బ్యాగ్ రూల్ గురించి అవగాహన కల్పించాలని బీసీఏఎస్ (BCAS) వెల్లడించింది. టికెట్లు, బోర్డింగ్ పాస్ లు..తదితర వాటిపై నిబంధన గురించి ప్రచారం చేయాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు