Fake RTPCR Certificate : హైదరాబాద్ లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ఈ ముఠా నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

Fake RTPCR Certificate : హైదరాబాద్ లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం

Fake Rtpcr

fake RTPCR and corona vaccine certificates : హైదరాబాద్ లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం రేగింది. పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు పరఫరా చేస్తోంది.

అటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ఈ ముఠా నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Medical Services : ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే వైద్య సేవలు

50 ఫేక్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, 10 ఫేక్ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ జోన్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. ఆసీఫ్ నగర్ లో తారీఫ్ కు సొంత ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు ట్రావెల్ చేయడానికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వ్యాక్సిన్ సర్టిఫికెట్లకు డిమాండ్ ఎక్కువంగా ఉంది.

ఈ నేపథ్యంలో ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వారితో టై అప్ చేసుకోని ముఠా ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని తెలిపారు. వీరి నుంచి మొత్తం 65 రిపోర్టులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.