Medical Services : ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే వైద్య సేవలు

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకుకోవాలని సూచించారు.

Medical Services : ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే వైద్య సేవలు

Srinivas

Medical services at home : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనాతో బాధపడుతున్న రోగుల ఇంటి వద్దకు వెళ్లి అధికారులు వైద్య సేవలు అందించనున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చి వైద్య సేవలు అందిస్తారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని.. కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగుల ఇంటి వద్దకు వెళ్లి వైద్యం అందిస్తామని చెప్పారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకుకోవాలని సూచించారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం(జనవరి21,2022) జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మంత్రి మాట్లాడారు. జ్వరాలు, దగ్గు ఇతర అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాకు అన్ని రకాల వైద్యం అందించడంలో భాగంగా ప్రభుత్వం ఇంటింట ఆరోగ్య పేరుతో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

జిల్లాలో ఇంటింటా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 1,89,319 ఇళ్లకు వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ కార్యకర్తలు సర్వే నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో 40 వేల కరోనా ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైతే లక్ష కిట్లు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా చికిత్స అవసరమైతే 08542-241165కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వైద్యం అందించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.