Pralhad Joshi: బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ నిందితుల విడుదలలో తప్పేం లేదు.. వివాదాస్పదమవుతోన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు

గ్యాంగ్‭రేప్ నిందితులకు బీజేపీ మద్దతు ఉందని చెప్పడానికి మరో ఉదహారణ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, వారి విడుదలను గుజరాత్ ప్రభత్వం సైతం సమర్ధించింది. 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 29న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారంనాడు తెలిపింది.

Pralhad Joshi: బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ నిందితుల విడుదలలో తప్పేం లేదు.. వివాదాస్పదమవుతోన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు

Done as per law: Pralhad Joshi on release of Bilkis Bano rape convicts

Updated On : October 18, 2022 / 7:56 PM IST

Pralhad Joshi: గుజరాత్‭లో సంచలన సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ కేసులో అరెస్టైన 11 మంది నిందితులు కొద్ది రోజుల క్రితం విడుదల అయ్యారు. అయితే వీరి విడుదలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అనేక నిరసనలు నేటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇక, ఆ నిందితులకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందనే ఆరోపణలు సరే సరి. దీంతో బీజేపీపై ప్రత్యక్షంగానే అనేక విమర్శలు వస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూరుర్చి పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నారా అన్నట్లు వ్యాఖ్యానించారు కేంద్ర ప్రహ్లాద్ జోషి.

మరికొద్ది రోజుల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. మంగళవారం బిల్కిస్ బానో గ్యాంగ్‭రేప్ నిందితుల విడుదలపై స్పందిస్తూ ‘‘వారిని విడుదల చేయడంలో తప్పేముంది? అందులో నాకు ఎలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. సత్‭ప్రవర్తనా నియమావళిని అనుసరించి చట్ట ప్రకారమే వారు విడుదల అయ్యారు’’ అని వ్యాఖ్యానించారు.

5G India Rollout : మార్చి 2023 నాటికి 200 నగరాల్లోకి 5G సర్వీసులు.. అసలు ప్రభుత్వం ప్లానింగ్ ఏంటంటే?

కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. గ్యాంగ్‭రేప్ నిందితులకు బీజేపీ మద్దతు ఉందని చెప్పడానికి మరో ఉదహారణ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, వారి విడుదలను గుజరాత్ ప్రభత్వం సైతం సమర్ధించింది. 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 29న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారంనాడు తెలిపింది.

దీనిపై గుజరాత్ ప్రభుత్వం సమాధానం సంబంధిత పార్టీలందరికీ అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో (2002) బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Delhi Riots case: జేఎన్‭యూ విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలిద్‭కు మరోసారి బెయిల్ నిరాకరణ