Rahul Gandhi
Rahul Gandhi: సర్జికల్ స్ట్రైక్స్ గురించి మన సైనికులు ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Kondagattu : కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
తన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘బీజేపీ నేతలు సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతుంటారు. పాక్ తీవ్రవాదుల్ని చంపామని చెబుతుంటారు. కానీ, ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎందుకు సరైన ఆధారాలు చూపించలేకపోయారు. బీజేపీ అబద్ధాలు చెప్పి పాలిస్తోంది’’ అని దిగ్విజయ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ స్పందించింది. ఇది సైనికుల శక్తి సామర్ధ్యానికి సంబంధించిన అంశం కావడంతో కాంగ్రెస్ కూడా స్పందించింది.
Pawan Kalyan : కొండగట్టులో పవన్‌కు ఘనస్వాగతం..
దిగ్విజయ్ వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా స్పందించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో దిగ్విజయ్ వ్యాఖ్యలతో మేం ఏకీభవించం. పార్టీ అభిప్రాయాలు.. దిగ్విజయ్ వ్యాఖ్యలకంటే భిన్నమైనవి. అవి మా పార్టీ అభిప్రాయాలు కావు. సర్జికల్స్ స్ట్రైక్స్ విషయంలో మేం కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నాం. ఈ విషయంలో మనం సైన్యం అద్భుతంగా పని చేసింది. వాళ్లు దీనికి ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలతో ఈ విషయంలో దిగ్విజయ్ ఒంటరయ్యారు. పార్టీ కూడా ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తోంది.