Dosa: అక్కడ మసాల దోశ 600 రూపాయలు.. వీడియో వైరల్

బహుశా ఈ దోశ వేయడానికి ఎల్పీజీ, సీఎన్జీ కాకుండా టర్బైన్ ఫ్యూయల్ వాడుంటారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.

Dosa: మామూలుగా హోటల్ వెళ్లి మసాల దోశ తింటే ఎంత బిల్లు కడతారు? అని ఎవరినైనా అడిగితే యాభయ్యే, అరవై అని చెబుతారు. పెద్ద హోటల్లో అయితే వంద రూపాయలపైన ఉండొచ్చు. కానీ అక్కడ దోశ తినాలంటే మాత్రం అక్షరాల 600 రూపాయాలు పర్సులోంచి తీయాల్సిందే. ఏంటి ఉలిక్కిపడ్డారా? వామ్మో.. మసాల దోశ ఆరు వందల రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు.. దీని గురించి తెలిసినవారంతా ఇలాగే నోరెళ్లబెతున్నారు. ఇంతకీ ప్లేస్ ఎక్కడంటారా?

ఆరు వందల రూపాయల మసాల దోశ తినాలనుంటే ముంబై విమానాశ్రయానికి వెళ్లాలి. ఎందుకంటే ఇంత ఖరీదైన దోశ అక్కడే దొరుకుతుంది మరి. రేటు ఎక్కువుంది కదా ఇందులో స్పెషల్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారేమో. అలాంటిది ఏమీ లేదు. అందుకే మామూలు మసాల దోశ.. ఇంత రేటా అని జనం అవాక్కవుతున్నారు. షెఫ్ డాన్ ఇండియా అనే ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ దోశ వీడియో షేర్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో దోశ కంటే బంగారం చావక అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఇది చూసి నెటిజనులు సైటర్లు పేలుస్తున్నారు.

Also Read: తన పిల్లలని ‘సలార్’ చూడనివ్వడం లేదని.. థియేటర్ యాజమాన్యంతో గొడవపెట్టుకున్న తల్లి!

”ఈ మసాల దోశ గురించి తెలుసుకుని సౌతిండియన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. బహుశా ఈ దోశ వేయడానికి ఎల్పీజీ, సీఎన్జీ కాకుండా టర్బైన్ ఫ్యూయల్ వాడుంటారు. వెండి రేటు సమానంగా ఈ దోశ ధర ఉంది. మా ఊర్లో దోశ 40 రూపాయలే. 2 గంటల పాటు ఆకలితో నకనకలాడినా ముంబై ఎయిర్‌పోర్టులో దోశ మాత్రం తినలేదు” అంటూ నెటిజనులు కామెంట్లు పెట్టారు. ఒకరిద్దరూ మాత్రం ఎయిర్‌పోర్టులో వసూలు చేసే దుకాణం అద్దె ఎంతో తెలుసుకోవాలని.. బహుశా దానికి అనుగుణంగానే ధరలు పెట్టివుంటారని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ముంబై ఎయిర్‌పోర్టులో దోశ రేటు మాత్రం వైరల్‌గా మారిపోయింది.

Also Read: నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

 

ట్రెండింగ్ వార్తలు