పెరోల్ పై బయటికొచ్చి…అదృశ్యమైన Dr Bomb

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 06:12 AM IST
పెరోల్ పై బయటికొచ్చి…అదృశ్యమైన Dr Bomb

Updated On : January 17, 2020 / 6:12 AM IST

1993ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68ఏళ్ల జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని  అగ్రిపాడా ఏరియాలోని మోమిన్‌పుర నివాసి అని, దేశవ్యాప్తంగా అనేక బాంబు పేలుళ్లలో కూడా అన్సారీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.

రాజస్థాన్ లోని అజ్మీర్ కేంద్ర కారాగారాము నుంచి 21 రోజుల పెరోల్ పొందిన జలీస్ అన్సారీ శుక్రవారం(జనవరి-17,2020)జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉందని ఆయన తెలిపారు. పెరోల్ పై బయట ఉన్న సమయంలో ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి 12గంటల మధ్యలో ముంబైలోని అగ్రిపాడ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావాల్సి ఉందని, అయితే గురువారం నిర్దేశించిన సమయంలో అన్సారీ స్టేషన్ కు రాలేదని అధికారి తెలిపారు.

గురువారం మధ్యాహ్నాం జలీస్ అన్సారీ కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు జయిద్ అన్సారీ(35)పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లెయింట్ ఇచ్చాడని తెలిపారు. ఆ కంప్లెయింట్ ప్రకారం..ఉదయం నిద్రలేచిన జలీస్ అన్సారీ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. కంప్లెయింట్ ప్రకారం దీనిని మిస్సింగ్ కేసుగా నమోదుచేసినట్లు స్టేషన్ అధికారి తెలిపారు.

జలీస్ అన్సారీని పట్టుకునేందుకు ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్, మహారాష్ట్ర ATS రంగంలోకి దిగాయని తెలిపారు. డాక్టర్ బాంబ్ గా పేరుపొందిన జలీస్ అన్సారీ సిమీ,ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాడని, ఆ ఉగ్రగ్రూపులకు బాంబుల తయారీ గురించి బోధించేవాడని తెలిపారు. 2008నాటి ముంబై బాంబ్ బ్లాస్ట్ లో జలీస్ పాత్ర గురించి 2001లో ఎన్ఐఏ అతడిని వాచారించినట్లు తెలిపారు.