Dr Dilip Mahalanabis: 20వ శతాబ్దపు ఉత్తమ వైద్య ఆవిష్కరణ ఓఆర్ఎస్ సృష్టికర్త, డాక్టర్ దిలీప్ కన్నుమూత

ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసింది భారతీయ వైద్యుడు డాక్టర్ దిలీప్ మహాలనబిస్. 88 ఏళ్ల వయసున్న ఆయన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు.

Dr Dilip Mahalanabis: ఓఆర్ఎస్ ద్రావణం అంటే తెలియని వారుండరు. ఎవరికి కాస్త నీరసం అనిపించినా ఓఆర్ఎస్ ద్రావణం తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాల్ని రక్షించే ద్రావణం ఇది. దీన్ని తయారు చేసింది భారతీయుడు.

Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై కేసులు అక్రమం.. గొడవలు వైసీపీ పనే: పవన్ కల్యాణ్

ఆయన పేరు డాక్టర్ దిలీప్ మహాలనబిస్. 88 ఏళ్ల వయసున్న ఆయన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డాక్టర్ దిలీప్ మహాలనబిస్ వైద్య రంగంలో విశిష్ట సేవలందించారు. ఆయన 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు సంక్షోభ సమయంలో శరణార్థులకు వైద్య సేవలు అందించారు. ఈ సమయంలో చాలా మంది ప్రజలు డయేరియా వల్ల డీహైడ్రేషన్‌తో మరణించారు. తన కళ్లముందే భారీ సంఖ్యలో రోగులు చనిపోతుండటంతో దీనికి పరిష్కారం కోసం ఆలోచించారు.

Deepavali 2022: దీపావళి ఆ రోజే.. స్పష్టం చేస్తున్న పండితులు

అలా డీ హైడ్రేషన్‌ను తగ్గించి, తక్షణ శక్తినిచ్చి, ప్రాణాలు నిలబెట్టే ఓఆర్ఎస్ ఫార్ములాను తయారు చేశాడు. నీళ్లు, గ్లూకోజ్, ఇతర లవణాలు కలిపి దీన్ని తయారు చేశాడు. ఈ ఆవిష్కరణతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఆవిష్కరణను అప్పట్లో ‘ది లాన్సెట్’ అనే మెడికల్ జర్నల్.. 20వ శతాబ్దపు ముఖ్యమైన ఆవిష్కరణగా పేర్కొంది. డాక్టర్ దిలీప్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు