2-DG Price : డీఆర్డీవో కరోనా డ్రగ్ “2-డీజీ” సాచెట్ ధర రూ.990
కరోనా కట్టడి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్అండ్ అలైడ్ సైన్సెస్(INMAS), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన న 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-DG)డ్రగ్ ధరను నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2 Dg Price
2-DG Price కరోనా కట్టడి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్అండ్ అలైడ్ సైన్సెస్(INMAS), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన న 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-DG)డ్రగ్ ధరను నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒక సాచెట్ ధర రూ. 990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.అయితే ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం డిస్కౌంట్ ధరలో 2డీజీ ఔషధాన్ని అందివ్వనున్నట్లు చెప్పారు. అయితే ఆ డిస్కౌంట్ ఎంత వరకు ఉంటుందన్న వివరాలను వెల్లడించలేదు.
కాగా,నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ ఇటీవల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.కరోనా రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో స్పష్టమైంది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఈ నెల 17న మొదటి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఔషధాన్ని జూన్ మధ్యలో వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది.