Ghaziabad : బైక్‌ను ఈడ్చుకెళ్లిన ట్రాక్టర్.. దాడి చేసుకున్న యువకులు.. గణేశ్ నిమజ్జనానికి వెళ్తూ..

ఘజియాబాద్‌ గణేశ్ నిమజ్జనంలో కొందరు యువకులు దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌ను ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్‌గా డ్రైవ్ చేసి ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

Ghaziabad

Ghaziabad : ఘజియాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొందరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బైక్ ను ట్రాక్టర్ ఈడ్చుకెళ్లడంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.

Uttar Pradesh: టోల్ చార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో తొక్కి చంపి పరారైన దుండగుడు

ఘజియాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో రోడ్డుపై యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. అంతలో ఓ ట్రాక్టర్ బైక్‌ను ఈడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నట్లు కనిపించింది. కొందరు యువకులు ట్రాక్టర్ నడుపుతున్నయువకులపై దాడికి తెగబడ్డారు. ఘజియాబాద్ జిల్లాలోని మురాద్ నగర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఘజియాబాద్ పోలీసులను ట్యాగ్ చేసారు.

Dogs Bulls Attack : వామ్మో.. రెచ్చిపోయిన వీధి కుక్కలు, ఎద్దు.. ఎలా దాడి చేశాయో చూడండి.. షాకింగ్ వీడియోలు

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఎటువంటి కేసు నమోదు కాలేదని.. ఇరువర్గాలను శాంతింపచేసి రోడ్డుపై ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.