Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారో…ఇక మీ రక్తం పీల్చుడే..

కొత్త నిబంధనల ప్రకారం   డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారు  ఒక యూనిట్  రక్తదానం చేయాలి. లేదా... సమీపంలోని ఆస్పత్రిలో కొన్ని గంటలపాటు రోగులకు  సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నింబంధనలపై అవగాహాన కల్పించాలి.

Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారో…ఇక మీ రక్తం పీల్చుడే..

Drunk And Drive Punjab

Updated On : July 17, 2022 / 6:34 PM IST

Drunk and Drive :  మద్యం సేవించి వాహానాలు నడపొద్దని పోలీసు శాఖ వారు ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా చాలా మంది మందు బాబులు అవేవీ పట్టించుకోకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు.  ఇక ఇలా కాదు వీళ్లు మారరు  అనుకుని పంజాబ్ పోలీసులు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి కొత్త ట్రాఫిక్ రూల్స్ రూపోందించారు. వాటికి అక్కడి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం   డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారు  ఒక యూనిట్  రక్తదానం చేయాలి. లేదా… సమీపంలోని ఆస్పత్రిలో కొన్ని గంటలపాటు రోగులకు  సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నింబంధనలపై అవగాహాన కల్పించాలి. రవాణా శాఖ నుంచి రీఫ్రెషర్ కోర్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. అందులో ఓవర్ స్పీడ్, వాహనం నడుపుతూ మొబైల్ వాడటం… డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్  రైడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటివి ఉన్నాయి. ఒక వేళ   రెండోసారి దొరికితే రెండింతల ఫైన్‌ వేస్తారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలిసినా.. మొబైల్‌ వాడినా రూ.5వేల జరిమానా విధిస్తారు. రెండోసారి కుడా దొరికితే ఆ జరిమానా  రెట్టింపు అవుతుంది.

అలాగే.. ఓవర్‌ లోడు వాహనాలకు రూ.20వేల జరిమానా విధించనున్నారు. రెండోసారి   అలాగే చేస్తే  జరిమానా రెండింతలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. సిగ్నల్‌ జంపింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌కు మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రెట్టింపు ఉంటుందన్నారు. పంజాబ్ లో ప్రతిరోజు 13 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. 2011-2020 మధ్య కాలంలో పంజాబ్ లో 56,959 రోడ్డు ప్రమాదాలు జరగగా..అందులో 46, 550 మంది మరణించారు.

Also Read : Tamil Nadu Kallakurichi : తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థిని ఆత్మహత్యతో బస్సులకు నిప్పు