Drone stocks rally: 20 శాతం మేర లాభాల్లో డ్రోన్ స్టాక్స్‌.. ఎందుకంటే?

ఇండియన్ డిఫెన్స్ స్టాక్ లాభపడడం గమనార్హం.

Drone stocks rally: 20 శాతం మేర లాభాల్లో డ్రోన్ స్టాక్స్‌.. ఎందుకంటే?

Updated On : May 9, 2025 / 4:29 PM IST

డ్రోన్లు, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే కొన్ని భారతీయ కంపెనీల షేర్ల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ భారత్ డ్రోన్లు, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వాడింది. ఈ నేపథ్యంలో ఇండియన్ డిఫెన్స్ స్టాక్ లాభపడడం గమనార్హం.

భారత్‌పై పాకిస్థాన్‌ దాడులకు తెగబడడంతో భారత్‌ వాటిని తిప్పికొట్టడమే కాకుండా.. దాయాది దేశంలో డ్రోన్లలో దాడులు చేసింది. ఆత్మాహుతి డ్రోన్‌లను వాడి కచ్చితమైన రీతిలో దాడులు జరిపింది. దీంతో డ్రోన్లు, రక్షణ సాంకేతికతను తయారు చేసే భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల ఆసక్తిని కనబర్చారు.

Also Read: పాక్‌ నుంచి ధనాధనా దూసుకొచ్చిన మిసైళ్లు, డ్రోన్లను భారత్ ఇలా ధ్వంసం చేసింది.. దాయాది దాడులు విఫలమైన తీరు ఇది..

లాభపడిన పలు కంపెనీలు

  • ఐడియాఫోర్జ్ టెక్నాలజీ: స్టాక్ 19.7 శాతం పెరిగి రూ.462కి చేరుకుంది
  • డ్రోనాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్: 5 శాతం పెరిగి రూ.68.13కి చేరుకుంది
  • జెన్ టెక్నాలజీస్: 5 శాతం పెరిగి రూ.1,406.35కి చేరుకుంది
  • పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్: 6.6 శాతం పెరిగి రూ.1,450కి చేరుకుంది

ఇండియన్ డిఫెన్స్ స్టాక్ లాభపడినప్పటికీ ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. శుక్రవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. పాకిస్థాన్ గత రాత్రి డ్రోన్లు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించిందని భారత సైన్యం ప్రకటించడంతో ఈ ఆందోళనకర పరిస్థితులు మరింత పెరగవచ్చని ప్రజలు భావించారు. ఈ కారణంగానే ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొన్నాయి.

మార్కెట్లో ఆందోళనలు ఉన్నప్పటికీ భారత డ్రోన్ కంపెనీల స్టాక్స్ పెరిగాయి. మొదట ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత్ ఆ తర్వాత పాకిస్థాన్ సైన్యంపై నేరుగా దాడి చేసింది. పాక్‌పై భారత్‌ డ్రోన్లను వాడి చేసిన దాడుల కారణంగానే డ్రోన్ కంపెనీల స్టాక్స్ లాభపడ్డాయి.