DUSU Poll Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఏబీవీపీ.. ఉపాధ్యక్ష పదవి గెలుచుకున్న ఎన్ఎస్‭యూఐ

లెక్కింపు 24 రౌండ్ కు వచ్చేప్పటికి అధ్యక్ష స్థానంలో ఏబీవీపీ 21,555 ఓట్లు గెలుచకోగా, ఎన్‌ఎస్‌యూ 17,833 ఓట్లు గెలచుకుంది. ఇక ఉపాధ్యక్ష పదవి రేసులో ఏబీవీపీ 18,763 ఓట్లు గెలుచకోగా, ఎన్‌ఎస్‌యూ 19,703 ఓట్లు గెలచుకుంది.

DUSU Poll Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఏబీవీపీ.. ఉపాధ్యక్ష పదవి గెలుచుకున్న ఎన్ఎస్‭యూఐ

Delhi University Student Union Election: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఈసారి కూడా ప్రధాన పోటీ ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ మధ్యే సాగింది. వామపక్ష సంస్థలు ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐలు పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీలో లేవు. కాన్ఫరెన్స్ సెంటర్‌లో శనివారం ఉదయం 8.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, లెక్కింపు ఓ కొలిక్కి వచ్చే సరికి భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయ ఢంకా మోగించింది.

ఇక వైస్ ప్రెసిడెంట్ (ఉపాధ్యక్ష) పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) గెలుచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల ఫలితాలు శనివారం అంటే నేడు విడుదల అయ్యాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులకు 24 మంది పోటీ పడ్డారు.

లెక్కింపు 24 రౌండ్ కు వచ్చేప్పటికి అధ్యక్ష స్థానంలో ఏబీవీపీ 21,555 ఓట్లు గెలుచకోగా, ఎన్‌ఎస్‌యూ 17,833 ఓట్లు గెలచుకుంది. ఇక ఉపాధ్యక్ష పదవి రేసులో ఏబీవీపీ 18,763 ఓట్లు గెలుచకోగా, ఎన్‌ఎస్‌యూ 19,703 ఓట్లు గెలచుకుంది. అలాగే కార్యదర్శి పదవి లెక్కింపులో ఏబీవీపీ 22,562 ఓట్లు గెలుచకోగా, ఎన్‌ఎస్‌యూ 9,742 ఓట్లు గెలచుకుంది. జాయింట్ సెక్రెటరీ కేటగిరీలో ఏబీవీపీ 22,833 ఓట్లు గెలుచకోగా, ఎన్‌ఎస్‌యూ 13,058 ఓట్లు గెలచుకుంది.