Earthquake
Earthquake : మణిపూర్ లో భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో 120 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. మయన్మార్‌లో సంభవించిన రెండో భూకంపం ఇది.
ALSO READ : Cold day warning : ఢిల్లీలో తీవ్ర చలిగాలులు…ఐఎండీ కోల్డ్ డే హెచ్చరిక
అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం 1:47 గంటలకు అసోంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారతదేశ భూకంప జోన్ మ్యాప్ ప్రకారం మణిపూర్ హై-రిస్క్ సీస్మిక్ జోన్ లో ఉంది. జోన్ 5 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్. జోన్ 2లో అతి తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి.
ALSO READ : సీఎం రేవంత్ రెడ్డి ముందు బిగ్ ఛాలెంజ్.. పార్లమెంటు ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా?
సెప్టెంబర్‌లో ఉఖ్రుల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మణిపూర్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.