Cold day warning : ఢిల్లీలో తీవ్ర చలిగాలులు.. ఐఎండీ కోల్డ్ డే హెచ్చరిక

దేశ రాజధాని నగరంలో రెండు రోజులపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ శనివారం హెచ్చరించింది. వాతావరణ కేంద్రం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో కోల్డ్-డే హెచ్చరికను జారీ చేసింది....

Cold day warning : ఢిల్లీలో తీవ్ర చలిగాలులు.. ఐఎండీ కోల్డ్ డే హెచ్చరిక

Cold day warning

Updated On : December 30, 2023 / 1:08 PM IST

Cold day warning : దేశ రాజధాని నగరంలో రెండు రోజులపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ శనివారం హెచ్చరించింది. వాతావరణ కేంద్రం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో కోల్డ్-డే హెచ్చరికను జారీ చేసింది. రాబోయే రెండు రోజులు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ALSO READ : సీఎం రేవంత్ రెడ్డి ముందు బిగ్ ఛాలెంజ్.. పార్లమెంటు ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా?

పంజాబ్, హర్యానా, ఆగ్నేయ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్, వాయువ్య రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. పొగమంచు పరిస్థితుల వల్ల ఢిల్లీ ప్రాంతంలో విమాన కార్యకలాపాలు, వాహనాల కదలికలు, రైళ్ల రాకపోకలను ప్రభావితం చేస్తాయని వాతావరణ శాఖ తన సలహాలో పేర్కొంది.

ALSO READ : Chandrababu Naidu : తిరుగుబాటు మొదలైంది.. 175 స్థానాలు మనవే- చంద్రబాబు నాయుడు

శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, వాయువ్య రాజస్థాన్, పంజాబ్, ఆగ్నేయ ఉత్తరాఖండ్, అస్సాం, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు కనిపించింది.పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ , వాయువ్య రాజస్థాన్‌పై పొగమంచు పొర కమ్మింది. రాబోయే రెండు రోజుల పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పేలవంగా నమోదైంది.