Earthquake In Haryana, Delhi : హర్యానా, ఢిల్లీల్లో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.7 గా నమోదైంది. హర్యానాలో భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Earthquake In Haryana, Delhi : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.7 గా నమోదైంది. హర్యానాలో భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నిన్న రాత్రి గం.10.37 సమయంలో ఝజ్జర్‌కు ఉత్తరాన పది కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది.

ఢిల్లీలో ఇంతకు ముందు జూన్‌ 20న పంజాబీ బాగ్‌ ప్రాంతంలో 2.1 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపుగా ప్రజలు నిద్రకు ఉపక్రమించే సమయంలో నిన్న రాత్రి ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురై ఇళ్ళలోంచి బయటకు వచ్చారు.

భూకంపం ధాటికి ఇళ్లలోని వస్తువులు, భవనాలు కదిలాయని పలువురు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఫాల్ట్‌లైన్‌కు దగ్గరగా ఉన్న ఢిల్లీలో భారీ భూకంపాలకు గురవుతుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

ఏప్రిల్‌ 12 నుంచి ఢిల్లీ నేషనల్‌క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) 24 సార్లు భూకంపాలను నమోదు చేసింది. నగరం సీస్మిక్‌ జోన్‌-4లోకి వస్తుందని, ఇది చాలా ఎక్కువ ముప్పు ఉన్న జోన్‌ అని తెలిపారు. ఢిల్లీలో రిక్టర్‌ స్కేల్‌పై 6 తీవ్రతతో భూమి కంపిస్తే భద్రతా నిబంధనలు పాటించని నిర్మాణాలు పెద్ద సంఖ్యలో కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు