మనిషా..మిషనా : 45 ఏళ్లుగా గాజు ముక్కలు తింటున్నాడు

  • Publish Date - September 14, 2019 / 05:33 AM IST

ఎవరైనా సిగరెట్లకు బానిసవుతారు, మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు మగువకు బానిసవుతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఒక లాయరు మాత్రం 45 ఏళ్లగా గాజు ముక్కలు తినటానికి బానిసయ్యాడు. జబల్ పూర్ డివిజన్ లోని దిండోరి కి చెందిన దయారామ్ సాహూ అనే లాయర్ గత  45 ఏళ్లుగా గ్లాస్ ముక్కలు తింటున్నాడు. ఇది ఒక వ్యసనంగా మారిందని….దీనివల్ల  పళ్లు దెబ్బతిన్నాయని అతను చెప్పాడు. కాగా ఎవరూ ఇలా తినవద్దని….అది ప్రమాదకరమని సాహూ చెప్పాడు.  ప్రస్తుతం గ్లాస్ ముక్కలు తినటం తగ్గించినట్లు తెలిపాడు.