గుడ్డు పై Hammer పడితే..ఏది పగులుతుంది ?

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 06:12 AM IST
గుడ్డు పై Hammer పడితే..ఏది పగులుతుంది ?

Updated On : October 1, 2020 / 6:55 AM IST

egg meets-hammer : అదేం ప్రశ్న..గుడ్డు (Egg) పై సుత్తి (Hammer) పడితే..గుడ్డే పగులుతుంది. అని అంటారు కదా..కానీ..ఓ వీడియోలో చూస్తే..ఆశ్చర్యపోతారు. గుడ్డపై సుత్తి పడితే..సుత్తే పగిలిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. అందులో వావ్ అనిపించే విధంగా ఉంటాయి.



మొదటి నుంచి చివరి దాక..చూసే విధంగా..ఉత్కంఠగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సాటిస్‌ ఫయింగ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ తన పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. టేబుల్ పై గుడ్డు ఉంది.



పై నుంచి సుత్తి మెల్లిగా (స్లో మోషన్) గుడ్డుపై పడింది. ఇంకేముంది గుడ్డు పగిలిపోతుంది కదా అని అనుకుంటారు. ఆశ్చర్యం..సుత్తి విరిగిపోయింది. కొశ్చన్ మార్క్ లా ముఖం పెట్టారు ఈ వీడియో చూసిన వారంతా.



అయితే..వాస్తవానికి గతంలోనే ప్రాంకో మెలానియా తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. మరలా సాటిస్ ఫయింగ్ అనే యూజర్ తిరిగి పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.



View this post on Instagram

 

Unbreakable egg??? ? @francomelanieh

A post shared by Satisfying Posts ? (@satisfyingxtimes) on