జవాన్లు వెళ్తున్న వ్యానును పేల్చేసిన మావోయిస్టులు.. 9 మంది మృతి

బీజాపూర్‌ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో మందుపాతర పేలింది.

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి 9 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. బీజాపూర్‌ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో ఈ మందుపాతర పేలింది.

జవాన్లు వెళ్తున్న వ్యానును మావోయిస్టులు పేల్చేశారు. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్‌లో జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించిన తర్వాత జవాన్లు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారని బస్తర్‌ ఐడీ మీడియాకు తెలిపారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే, మావోల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు.

అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన మరవకముందే మావోయిస్టులు మందుపాతర పెట్టి తొమ్మిది మంది ప్రాణాలు తీశారు.

తెలంగాణ అప్పు తీర్చాలని రేవంత్ నాతో చర్చలు జరుపుదామన్నారు: కేఏ పాల్ కామెంట్స్