తెలంగాణ అప్పు తీర్చాలని రేవంత్ నాతో చర్చలు జరుపుదామన్నారు: కేఏ పాల్ కామెంట్స్

తాను నియంతలను వందల దేశాల్లో చూసి వచ్చానని తెలిపారు.

తెలంగాణ అప్పు తీర్చాలని రేవంత్ నాతో చర్చలు జరుపుదామన్నారు:  కేఏ పాల్ కామెంట్స్

ka paul

Updated On : January 6, 2025 / 3:40 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇవాళ కరీంనగర్‌లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

“తమ్ముడు రేవంత్ కి ఒక్కటే చెబుతున్నా.. నియంతలను వందల దేశాల్లో చూసి వచ్చాను. తమ్ముడు రేవంత్ రెడ్డిని నేను పూర్తిగా తప్పుపట్టను. 10 ఏళ్లలో కేసీఆర్ 7 లక్షల కొట్ల రూపాయల అప్పు చేశారు. తెలంగాణ అప్పు తీర్చాలని రేవంత్ నాతో చర్చలు జరుపుదామన్నారు.

నేను మద్దతిచ్చాను. రేవంత్ వచ్చాక అప్పులు ఎక్కువయ్యాయి. కనీసం తులం బంగారం, రైతు బంధు ఏమైంది? అన్ని వాగ్దానాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి నేను రంగంలోకి దిగాను. దేశంలో తుమ్మితే ఊడిపోయేలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి.

సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు ఒక్క సీటూ లేకుండా చేద్దాం. కేసీఆర్ తాగడానికి మందు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి కావాల్సిన ఆదాయం నేను ఇప్పిస్తాను. కేసీఆర్ రిటైర్ అయ్యారు. కేటీఆర్, కవిత వారి డబ్బులను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారు” అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ అరెస్టు.. బెయిల్‌ దక్కినా జైలుకు పీకే?