ప్రాణబిక్ష పెట్టిన ఏనుగు

ఏనుగులు ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవు. కానీ ఓ ఏనుగు వ్యక్తికి ప్రాణబిక్ష పెట్టింది. తాజాగా ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఓ ఏనుగు దగ్గర కేకలు పెడుతున్నవారిని చూసి గజరాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది. దీంతో వారి వైపు ఏనుగు దూసుకెళ్లింది. గజరాజును చూసి అక్కడున్న ముగ్గురు వ్యక్తులు పరిగెట్టారు. అయితే వారిలో ఒకడు కిందపడిపోయాడు.
ఏనుగు తలచుకుంటే… అతన్ని ఒక్క దెబ్బకు చంపేసేదే. కానీ ఎందుకో అది జాలి తలచింది. అతను రెండు సార్లు తన కాలికి చిక్కినా… చంపకుండా వదిలేసింది.