Chandrayaan-3 Success : చంద్రయాన్-3 విజయంపై ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్‌ల ప్రశంసలు

చంద్రయాన్ -3 ప్రాజెక్టు విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను, భారతదేశాన్ని అభినందనలతో ముంచెత్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ ఇస్రోను అభినందించింది....

Elon Musk, Sundar Pichai

Chandrayaan-3 Success : చంద్రయాన్ -3 ప్రాజెక్టు విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను, భారతదేశాన్ని అభినందనలతో ముంచెత్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ ఇస్రోను అభినందించింది.

ISRO Heroes : బెంగళూరులో ఇస్రో హీరోలను కలవనున్న ప్రధాని మోదీ

‘‘ఎంతో అపురూపమైన క్షణం! ఈ ఉదయం చంద్రుడిపై చంద్రయాన్3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ఇస్రోకి అభినందనలు. ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతంగా సాధించిన మొదటి దేశంగా భారత్ అవతరించింది’’ అని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్… ఇస్రో కీలక ట్వీట్

అభినందనలు భారతదేశం అంటూ అమెరికా పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. ‘‘నక్షత్రాలను ఎలా లక్ష్యంగా చేసుకోవాలో మాకు నేర్పుతుంది, మన సొంత సామర్ధ్యంపై నమ్మకం కలిగింది. మళ్లీ ఎదగడానికి దాన్ని వేదికగా ఎలా ఉపయోగించాలో మాకు చూపుతోంది. అన్నింటికంటే భారతీయులమైనందుకు మాకు గర్వకారణంగా ఉంది’’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టరులో పేర్కొన్నారు.

Chandrayaan-3 : ‘సైకిల్ నుంచి చందమామ దాకా’ చంద్రయాన్ -3 సక్సెస్ వేళ .. వైరల్ అవుతున్న ఫోటో

‘‘ఇస్రోలోని మా అద్భుతమైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లందరికీ అభినందనలు. ఇది మన సాంకేతికత యొక్క ఇంజనీరింగ్ శ్రేష్ఠతకు నిదర్శనం’’ అని మరో పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు