Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్… ఇస్రో కీలక ట్వీట్

చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై గురువారం విజయవంతంగా మోహరించింది. భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3, విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుని ఉపరితలాన్ని తాకి చరిత్ర సృష్టించిన కొన్ని గంటల తర్వాత విక్రమ్ పైకి ప్రజ్ఞాన్ రోవర్ వెళ్లింది....

Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్… ఇస్రో కీలక ట్వీట్

Rover Pragyan ramps down

Chandrayaan-3 Landing : చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై గురువారం విజయవంతంగా మోహరించింది. భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3, విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుని ఉపరితలాన్ని తాకి చరిత్ర సృష్టించిన కొన్ని గంటల తర్వాత విక్రమ్ పైకి ప్రజ్ఞాన్ రోవర్ వెళ్లింది. (Rover Pragyan ramps down lander Vikram)

Wagner chief Yevgeny Prigozhin : వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మాస్కో విమాన ప్రమాదంలో మృతి

భారతదేశం చంద్రునిపై నడిచింది అని ఇస్రో ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది. (India takes a walk on Moon) మైక్రోవేవ్ ఓవెన్ పరిమాణంలో ఉన్న రోవర్ చంద్రుని ఉపరితలంపై 500 మీటర్ల వరకు ప్రయాణించేలా రూపొందించారు. ఈ రోవర్ చంద్రుని భూగర్భంపై ఉన్న ఖనిజాలు, వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. చంద్రయాన్-3 మిషన్ భారతదేశానికి చెందిన మూడవ చంద్ర మిషన్. మొదటి చంద్రయాన్-1 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది రెండు సంవత్సరాలు పనిచేసింది.

Vegetable Prices Decline : సెప్టెంబరు నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం: ఆర్‌బీఐ చీఫ్‌ శక్తికాంతదాస్ వెల్లడి

చంద్రయాన్-2 మిషన్ 2019 లో ప్రారంభించారు, కానీ చంద్రుడిపై ల్యాండ్ చేయడంలో విఫలమైంది. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడం వల్ల అమెరికా, సోవియట్ యూనియన్,చైనా తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై మోహరించిన మొట్టమొదటిది.

Sugar Exports Ban : ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం ?

ఈ ప్రజ్ఞాన్ రోవర్ కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్‌తో సహా పలు రకాల పరికరాలతో అమర్చారు. ప్రజ్ఞాన్ రోవర్ ఒక చాంద్రమాన రోజు అంటే 14 ఎర్త్ డేస్ కోసం పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రజ్ఞాన్ రోవర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొందుతూ చంద్రయాన్-3 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్ చేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.