Inspirational Story : భార్యకి చీర కొంటూ మిల్లు యజమానికి లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పారో తెలుసా!

దేశానికి ప్రధాని అయినా తన కుటుంబ స్థోమతను బట్టి నడుచుకోవాలి అనేది లాల్ బహదూర్ శాస్త్రిగారి నుంచి నేర్చుకోవాలి. ఆయన సింప్లిసిటీ, నిజాయితీకి అద్దం పట్టే ఆయన జీవితంలోని ఓ సంఘటన చదవండి. స్ఫూర్తి పొందుతారు.

Inspirational Story : భార్యకి చీర కొంటూ మిల్లు యజమానికి లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పారో తెలుసా!

Inspirational Story

Inspirational Story : లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత దేశానికి  రెండవ ప్రధానిగా సేవలందించారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రధానిగా ఉన్నతమైన పదవిలో ఉన్నా ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన జీవితంలోని ఒక సంఘటన మనకు ఎంతో ప్రేరణను కలిగిస్తుంది.

Independence day 2023 : తెలుగు దేశభక్తి సినిమాల్లో ఈ డైలాగ్స్ విన్నారా..? గూస్‌బంప్స్ రావాల్సిందే..

లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఒక టెక్స్ టైల్ మిల్లుని సందర్శించడానికి వెళ్లారట. అక్కడ ఉన్న మిల్లు యజమాని ఎంతో సంబరపడిపోయాడట. మిల్లు మొత్తం దగ్గరుండి చూపించాడట. అక్కడ ఉన్న చీరలు చూసి శాస్త్రిగారు తన భార్య లలిత గారి కోసం కొన్ని చీరలు చూపించమని అడిగారట. వెంటనే మిల్లు యజమాని తమ మిల్లులో ఉన్న బెస్ట్ చీరలు తీసుకువచ్చి శాస్త్రిగారికి చూపించాల్సిందిగా సేల్స్ మ్యాన్‌కి ఆర్డర్ వేసాడట. యజమాని రకరకాల చీరలు తీసుకువచ్చి చూపించాడట. అవన్నీ చాలా ప్రత్యేకంగా ఉండటమే కాదు.. చాలా నాణ్యంగా కూడా ఉన్నాయట. వాటిని చూసి శాస్త్రిగారు ఖరీదు అడిగారట. యజమాని చీర ఖరీదు రూ.800 చెప్పాడట. అంతకంటే తక్కువ ధరలో ఉన్న చీరలు చూపించమని శాస్త్రిగారు అడిగారట.

మిల్లు యజమాని మరిన్ని చీరలు తెప్పించి చూపించాడట. వాటి ఖరీదు రూ.400, రూ.500 కావడంతో ఇవి కూడా ఖరీదైనవి.. నాలాంటి పేదవాడు కొనగలిగే చీరలు మీ దగ్గర ఉన్నాయా? అని శాస్త్రిగారు మిల్లు యజమానిని అడిగారట. అందుకు మిల్లు యజమాని మీరు భారత దేశ ప్రధాని.. మీరు నిరుపేద ఎలా అవుతారు?  అసలు మీరు చీర కొనడం ఎందుకు?  మీకు బహుమతిగి ఇస్తానని చెప్పాడట. అప్పుడు శాస్త్రిగారు అంత ఖరీదైన బహుమతి తాను తీసుకోనని సమాధానం ఇచ్చారట.

Independence Day 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15 ఆగస్టు 1947 మంచి రోజు కాదట .. కానీ భారత్‌కు స్వాతంత్ర్యం ఎలా ఇచ్చారు?

ప్రధాని అంతటివారు తన మిల్లుకి రావడమే గొప్ప.. తను ఇచ్చే బహుమతి తీసుకోవాలని మిల్లు యజమాని శాస్త్రిగారిని పట్టుబట్టాడట. శాస్త్రిగారు నేను ప్రధానమంత్రిని అయినా నా స్థోమతకు మించిన వాటిని తీసుకుని భార్యకు ఇవ్వలేను.. తక్కువ ధరలో ఉన్న చీరలు ఉంటే చూపమని అడిగి వాటిని కొనుగోలు చేసారట. ఎంత చక్కని స్ఫూర్తి కలిగించే సంఘటనో కదా. దీని ద్వారా ఆయన సింప్లిసిటీ, నిజాయితీ, నిబద్ధత మనం అర్ధం చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకోవాలి.