Pandora Papers: మిలటరీ మాజీ అధికారి.. కొడుకుల అక్రమ పెట్టుబడి 10 లక్షల డాలర్లు

పండోరా పేపర్లలో మరో ఆర్థిక నేరగాడి గురించి చర్చనీయాంశంగా మారింది. మిలటరీ మాజీ అధికారి తన కొడుకు కలిసి సీచెల్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ కంపెనీలో 10లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టారు.

Pandora Papers: మిలటరీ మాజీ అధికారి.. కొడుకుల అక్రమ పెట్టుబడి 10 లక్షల డాలర్లు

Pandora Papers

Updated On : October 5, 2021 / 11:58 AM IST

Pandora Papers: పండోరా పేపర్లలో మరో ఆర్థిక నేరగాడి గురించి చర్చనీయాంశంగా మారింది. మిలటరీ మాజీ అధికారి తన కొడుకు కలిసి సీచెల్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ కంపెనీ(ఐబీసీ)లో 10లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ లో తేలిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.

డిసెంబర్ 2016లో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రాకేశ్ కుమార్ లూంబా సీచెల్స్ లో రారింట్ పార్టనర్స్ లిమిటెడ్ పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. కొడుకు రాహుల్ లూంబా పేరు కూడా ఇందులో నమోదై ఉంది. 2010లో రిటైర్ అయిన సమయంలో ఆయన 3బలగాలకు జనరల్ కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. లూంబా కంపెనీ బ్యాంక్ అకౌంట్ మారిషియస్ ఏబీసీ బ్యాంకింగ్ కార్పొరేషన్ నుంచి సంవత్సరానికి మిలియన్ డాలర్లు చొప్పున డిపాజిట్ అవుతున్నాయని తెలిసింది.

తొలిసారి డిసెంబర్ 2016లో లక్ష డాలర్లు డిపాజిట్ కాగా, సంవత్సరానికి 5లక్ష డాలర్ల వరకూ ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇందులో డైరక్టర్లుగా లూంబాలు ఇద్దరితో పాటు ఢిల్లీకి చెందిన అనంత్ ఘ్యనశ్యామ్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు తొలి డైరక్టర్లుగా బెనిఫిషియల్ ఓనర్లుగా కంపెనీలో రిజిష్టర్ అయి ఉన్నారు.

……………………………………………..: రోడ్ యాక్సిడెంట్ బాధితుల్ని హాస్పిటల్‌కు తీసుకెళ్తే రూ.5వేలు

ఘన శ్యామ్ కు 34శాం వాటా ఉండగా, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రాకేశ్ కుమార్ లూంబా, రాహుల్ లూంబా ఒక్కొక్కరు 33శాతం వాటా కలిగి ఉన్నారు. మారిషియస్ బ్యాంక్ అకౌంటింగ్ ఓపెనింగ్ ఫామ్స్ లో ముగ్గురు సంతకాలు చేశారు. గురుగ్రామ్ లో ఉండే వీళ్లు రెసిడెన్షియల్ అడ్రస్ పలు చోట్ల ఉన్నట్లుగా బ్యాంకు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు.