Exam for teachers' recruitment in Rajasthan cancelled after paper leak
Rajasthan: ఆదివారం జరగాల్సిన రాజస్తాన్ రెండవ తరగతి ఉపాధ్యాయ నియామక పరీక్ష (సెకండ్ గ్రేడ్ టీచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్) ప్రశ్నాపత్రం శనివారం లీక్ అయింది. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. లీకైన ఆ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అనంతరం నెటిజెన్ల నుంచి పరీక్ష వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్ష రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు జరగాల్సి ఉంది.
Bharat Jodo Yatra: ఢిల్లీలో రాహుల్ పాదయాత్ర షురూ.. కొవిడ్ నిబంధనలు విడుదల చేయాలన్న ఆప్
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పటికే 50 మందికి పైగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ సెకండ్ గ్రేడ్ టీచర్ కాంపిటేటివ్ పరీక్ష పేపర్ లీక్ అంశంతో సంబంధం ఉందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇందులో 42 మందిని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారట. ఇక ఎనిమిది మందిని ఒక హోటల్ రూం నుంచి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇద్దరు నకిలీ అభ్యర్థుల్ని సైతం పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Bangladesh vs India: రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే బంగ్లా ఆలౌట్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన భారత్
పోలీసుల అదుపులో ఉన్న వారిలో ఎక్కువ మంది జలోర్, సిరోహి జిల్లాలకు చెందినవారే. వీరంతా జోద్పూర్ కేంద్రంగా ఇలాంటి పనులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దౌసా జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కమలేష్ కుమార్ మాట్లాడుతూ ‘‘మా సెంటర్ కోడుతో ఒక జీకే ప్రశ్నాపత్రం బాక్స్ వచ్చింది. అది తెరిచి చూస్తే ప్రశ్నాపత్రాలు ఉన్నాయి కానీ, అందులో మా సెంటర్ కోడ్ లేదు. వెంటనే మేము జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చాం. పరీక్ష వాయిదా వేసినట్లు వారు వెల్లడించారు’’ అని తెలిపారు.
Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’
అధికార వర్గాల సమాచారం ప్రకారం సాయంత్రం జరగాల్సిన జనరల్ నాలెడ్జ్, సైన్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయ్యాయి. ఈ విషయమై గెహ్లాట్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని మండిపడుతున్నాయి. పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, ఇందులో ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండానే జరగవని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక రాష్ట్రంలో పేపర్ లీక్ అనేది ఆనవాయితీగా మారిందని సైతం విమర్శలు వస్తున్నాయి.
South Africa: దక్షిణాఫ్రికాలో దారుణం.. బోక్స్‌బర్గ్‌లో 10మంది మృతి.. భయంకరమైన వీడియో
పేపర్ లీక్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ రాష్ట్ర యువతకు అన్యాయం జరగకూడదనే రెండవ తరగతి ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, ఎవరికి అన్యాయం జరిగినా ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. కాగా, దోషులు ఎవరైనా కఠిన శిక్ష విధిస్తామని పేర్కొన్నారు. రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ సబ్జెక్టుల కోసం డిసెంబరు 21 నుంచి డిసెంబర్ 27 వరకు సీనియర్ టీచర్ గ్రేడ్ 2 సెకండరీ ఎడ్యుకేషన్ పోటీ పరీక్షను నిర్వహిస్తోంది. సైన్స్ పేపర్ ఈరోజు రెండవ షిఫ్ట్‌లో జరగాల్సి ఉంది.