Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’

వివిధ కేసుల్లో ఇటీవల పట్టుబడిన 2 లక్షల కేజీల గంగాయి, 131 లీటర్ల యాష్ ఆయిల్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి, ఇతర డ్రగ్స్‌ను అధికారులు దహనం చేశారు. దీని విలువ మొత్తం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.

Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ‘ఆపరేషన్ పరివర్తన్’లో భాగంగా గంజాయి వంటి డ్రగ్స్‌ను అరికడుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ మొత్తంలో గంజాయిని ధ్వంసం చేశారు. వివిధ కేసుల్లో ఇటీవల పట్టుబడిన 2 లక్షల కేజీల గంగాయి, 131 లీటర్ల యాష్ ఆయిల్‌ను అధికారులు ధ్వంసం చేశారు.

Group 4 Jobs: నిలిచిపోయిన గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. అభ్యర్థుల్లో అయోమయం

ఈ గంజాయి, ఇతర డ్రగ్స్‌ను అధికారులు దహనం చేశారు. దీని విలువ మొత్తం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ‘ఆపరేషన్ పరివర్తన్’లో భాగంగా అధికారులు ఇప్పటికే ఆరుసార్లు గంజాయి ధ్వంసం చేశారు. తాజాగా శనివారం మరోసారి ఈ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపడుతోంది. దీనిలో భాగంగా వివిధ జిల్లాల్లో పట్టుబడ్డ గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ సరఫరాపై అధికారులు దృష్టి పెట్టారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల అల్లూరి జిల్లా, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి, ఇతర డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్రమ గంజాయి రవాణా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.