×
Ad

2020లో బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్ ఎలా వచ్చాయి? అంచనాలు అంతలా ఎలా తప్పాయి? మరి ఇప్పుడు ఏం జరగనుంది?

బిహార్‌ ఎన్నికలు-2020లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించింది. మొత్తం 125 స్థానాలు గెలుచుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం..

Exit Poll Accuracy

Exit Poll Accuracy: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అన్ని వేళలా నిజమవుతాయని చెప్పలేము. అయితే, ఎన్నో ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలిన ఫలితాలే కొంచం అటూఇటూగా అధికారిక ఫలితాల్లోనూ వచ్చాయి.

బిహార్‌ అసెంబ్లీ -2025 ఎన్నికల్లో అన్ని సంస్థలు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాయి. 2020లో ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఓటర్ల నాడీని సరిగ్గా పట్టలేకపోయాయి. ఆ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌ గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. కానీ, ఎన్డీఏ గెలిచింది. 243 స్థానాల బిహార్‌ అసెంబ్లీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏదైనా కూటమి/పార్టీకి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.

2020 ఎన్నికల్లో అధికారికంగా ఏ కూటమికి ఎన్ని?

బిహార్‌ ఎన్నికలు-2020లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించింది. మొత్తం 125 స్థానాలు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 74, జనతా దళ్‌ (యునైటెడ్‌)కు 43, వికాస్‌శీల ఇన్సాన్‌ పార్టీ, హిందుస్థానీ అవామ్‌ మోర్చా తలా 4 స్థానాలు గెలిచాయి.

మహాఘట్‌బంధన్‌లోని రాష్ట్రీయ జనతా దళ్‌ 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయినా ఆ కూటమి అధికారాన్ని సాధించలేకపోయింది.

అనేక సర్వే సంస్థలు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ విజయం సాధిస్తుందని, నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్‌డీఏ స్పష్టమైన మెజార్టీ సాధించకపోవచ్చని అంచనా వేశాయి. కానీ, అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ 2020 అంచనాల్లో కొన్ని..

న్యూస్‌18–టుడేస్‌ చాణక్య: మహాఘట్‌బంధన్‌ 180, ఎన్‌డీఏ 55 సీట్లు

ఇండియా టుడే–ఆక్సిస్‌ మై ఇండియా: మహాఘట్‌బంధన్‌ 139–161, ఎన్‌డీఏ 69–91 సీట్లు

రిపబ్లిక్‌–జన్‌ కి బాత్‌: మహాఘట్‌బంధన్‌ 118–138, ఎన్‌డీఏ 91–117, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) 5–8 సీట్లు3

న్యూస్‌ఎక్స్–పోల్స్‌ట్రాట్: మహాఘట్‌బంధన్‌ 108–123, ఎన్‌డీఏ 90–110

పాట్రియోటిక్‌ వోటర్‌:  మహాఘట్‌బంధన్‌ 107 సీట్లు, ఎన్‌డీఏ 129,

ఏబీపీ–సీ వోటర్‌: మహాఘట్‌బంధన్‌ 64–84, ఎన్‌డీఏ 141–161,  లోక్‌ జనశక్తి పార్టీ 13–23 సీట్లు

ఈ సారి మాత్రం..

ఈ సారి మాత్రం దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పాయి. దీంతో ఎన్డీఏ నేతలు మళ్లీ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More: Bihar Exit Polls 2025: బిహార్‌ ఎన్నికల్లో గెలుపు ఆ కూటమిదే.. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏం తేలింది?