Viral Video: ఆటో ఎక్కి మహిళను బెదిరించిన నకిలీ పోలీసు.. ఏం జరిగిందంటే?

ఆటోలోని ప్రయాణికురాలిని అరెస్టు చేస్తానని, రూ.50,000 చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అతడు బెదిరించాడు.

రోడ్డుపై ఓ ఆటో వెళుతోంది.. అందులో ఓ మహిళ ప్రయాణిస్తోంది.. ఆమె వేప్‌ ద్వారా పొగ పీల్చుతోంది. ఆ ఆటోలోకి జంప్ చేసి ఎక్కాడో వ్యక్తి. అతడు వైట్‌ షర్ట్, వైట్‌ ప్యాంట్ ధరించి ఉన్నాడు. తాను పోలీసునని, వేప్‌ వాడుతున్న కారణంగా రూ.50,000 జరిమానా కట్టాలని ఆమెను బెదిరించాడు ఆ వ్యక్తి.

డబ్బులు ఇవ్వబోనని ఆమె చెప్పింది. దీంతో అతడు పోవై చౌకీకి ఆటోని తీసుకెళ్లు అంటూ డ్రైవర్‌కు చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బాధితురాలు తన స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగింది.

ఆటోలోని ప్రయాణికురాలిని అరెస్టు చేస్తానని, రూ.50,000 చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అతడు బెదిరించాడు. అతడు నకిలీ పోలీస్ అని ఆ మహిళను అనుమానం వచ్చి ఆటో లోపలినుంచే తెలివిగా ఈ వీడియో తీసింది.

“నేను ఇప్పుడు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రోడ్‌లో ఉన్నాను. ఈ వ్యక్తి నన్ను ఫాలో అవుతూ ఆటోలోకి ఎక్కాడు. అతను నన్ను బలవంతంగా పోవై చౌకీకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు” అని ఆమె చెప్పింది. చివరికి అతడు ఆటో దిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసునని చెప్పుకున్న దుండగుడికి భయపడకుండా ప్రయాణికురాలు చూపించిన ధైర్యానికి సెల్యూట్ కొట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి