మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

మృతులు పాముబండ తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

Accident

Updated On : October 16, 2024 / 5:19 PM IST

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం ఏడుగురు మృతి చెందారు. ఉసిరిక‌ప‌ల్లి వ‌ద్ద మీదుగా కారులో ఏడుగురు వెళ్తున్న సమయంలో ఆ వాహనం అదుపుతప్పడంతో అది చెట్టుకు ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కాలువలో కారు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉసిరిక‌ప‌ల్లి నుంచి వెల్దుర్తి వ‌ర‌కు రోడ్లు విస్త‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవ‌ర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి త‌ర‌లించారు. మృతులు పాముబండ‌ తండా, ర‌త్నాపూర్‌తో పాటు తాళ్ల‌ప‌ల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జయింది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది.

Viral Video: ట్రాఫిక్ జామ్‌ అవుతున్నా పట్టించుకోకుండా.. నడిరోడ్డుపై వాహనదారుల ఫైటింగ్‌