Varanasi Hajmola Chai
Varanasi Hajmola Chai : టీ ప్రియులు చాలామంది ఉంటారు. ఎక్కడికి వెళ్లినా రకరకాల ఫ్లేవర్స్‌తో తయారు చేసిన టీ తాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారణాశిలో ప్రసిద్ధి చెందిన ‘హజ్మోలా చాయ్’ తయారీ వీడియో వైరల్ అవుతోంది.
Hyderabad : అమెరికా రాయబారికి హైదరాబాద్ ఇరానీ చాయ్ నచ్చేసిందట
చాలామంది స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ఉంటుంది. పానీ పూరీ, రోల్స్, జిలేబీ, సమోసా, కచోరీ ఇలా.. అయితే ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాశి గురించి చెప్పుకోవాలి. వారణాశిలోని ప్రసిద్ధ ఘాట్‌ల వద్ద ప్రశాంత వాతావరణమే కాదు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. కుల్హాద్ చాయ్, చూడా మాటర్, కచోరీ సబ్జీ, లస్సీ, దాల్ బాటీ చోఖా వీటితోపాటు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన ‘హజ్మోలా చాయ్’ దొరుకుతాయి. అస్సి ఘాట్ దగ్గర ఈ హజ్మోలా చాయ్ దుకాణాలు కనిపిస్తాయట.
shiv_yash_bhukkadofagra అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో హాజ్మోలా చాయ్ ఎలా తయారు చేస్తారో చూపించారు. నిమ్మరసంతో కూడిన సువాసనగల టీ, పుదీనా ఆకుల రిఫ్రెష్ టచ్‌తో పాటు పొడి చేసిన హజ్మోలా మిఠాయితో కలిసి ప్రతి సిప్‌లో కొత్త రుచిని అందిస్తుంది. ఈ చాయ్ సిటీ అంతా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇంతకు ముందు కూడా అనేకమంది బ్లాగర్లు ఈ పానీయం తయారీ వీడియోలను పంచుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలామంది స్పందించారు.
MBA Chaiwala: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా.. ఎలా సాధ్యమైందంటే!
‘కూల్’ అని ఒకరు.. ‘కాంబినేషన్ విచిత్రంగా ఉంది’ అని ఒకరు కామెంట్లు పెట్టారు. వారణాశిలో ఈ చాయ్ తయారీ దుకాణాలు చాలా సంవత్సరాలుగా నడుపుతున్నారు. కొందరైతే వంశపారం పర్యంగా కూడా ఈ టీ దుకాణాలు కొనసాగిస్తున్నారు.