Hyderabad : అమెరికా రాయబారికి హైదరాబాద్ ఇరానీ చాయ్ నచ్చేసిందట

అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఎరిక్ గార్సెట్టి అధికారిక పర్యటనలో భాగంగా తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు. చార్మినార్‌తో పాటు పలు ప్రాంతాలను సందర్శించిన ఆయనకు చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ నచ్చిందట. ఈ విషయాన్నిట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

Hyderabad : అమెరికా రాయబారికి హైదరాబాద్ ఇరానీ చాయ్ నచ్చేసిందట

Hyderabad

US Ambassador in Hyderabad : కొత్తగా బాధ్యతలు చేపట్టిన అమెరికా రాయబారి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. చార్మినార్‌ను సందర్శించిన ఆయన ఇరానీ చాయ్ సేవించారు. చార్మినార్‌ను, ఇరానీ చాయ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు.

NTR – Pranathi : చార్మినార్‌ వద్ద ఎన్టీఆర్‌ భార్య ప్రణతి షాపింగ్‌.. ఫోటో వైరల్‌!

భారత్‌లో కొత్తగా నియమితులైన యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి చార్మినార్‌ను సందర్శించారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్ సేవించారు. ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన ఉస్మానియా బిస్కెట్లను కూడా రుచి చూశారు. అక్కడ తాను దిగిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘తెలంగాణకు చార్మినార్ ఎందుకు ప్రసిద్ధమైందో అర్ధం చేసుకోవడం సులభం.. 500 సంవత్సరాల అందమైన చరిత్రకు ఈ ప్రాంతం అద్దం పడుతోంది. ఇక్కడ చాయ్ కూడా అద్భుతంగా ఉంది’ అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన ఫోటోలకు చాలామంది కామెంట్లు పెట్టారు. ఇంకా హైదరాబాద్‌లో చూడదగిన ప్రాంతాలను ఆయనకు సూచించారు.

RC15: చార్మినార్ దగ్గర చరణ్ మూవీ షూటింగ్.. అప్డేట్ ఇచ్చిన శంకర్!

అమెరికా 247 వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌ను ఒకరోజు ముందు ఆయన ప్రారంభించారు. అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన గార్సెట్టి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. చార్మినార్ సందర్శనకంటే ముందు ఆయన చారిత్రాత్మక చౌమహల్లా ప్లాలెస్‌ను, రాయ్ దుర్గ్‌లోని టి-హబ్‌ను సందర్శించారు.