Manhole : రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా? ఎంత ప్రమాదమో మీరే చూడండి..
రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. అలా చేయడం ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. అవును.. ఓ చేతిలో చంటి బిడ్డ... మరో చేతిలో ఫోన్.. అం

Faridabad Woman
Manhole : రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. అలా చేయడం ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. అవును.. ఓ చేతిలో చంటి బిడ్డ… మరో చేతిలో ఫోన్.. అందులో మాట్లాడుతూ రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ చావు అంచుల వరకు వెళ్లొచ్చింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.
Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం
రోడ్డు మీద ఫోన్ లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన హరియానాలో చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌లోని జవహార్ కాలనీలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మహిళ మ్యాన్‌హోల్‌లో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. అందులోకి దిగి బిడ్డను, మహిళను సురక్షితంగా బయటకు తీశారు.
Vitamin B12 : విటమిన్ బి12 వల్ల కలిగే ప్రయోజనం తెలుసా?..
అయితే ప్రమాదానికి ముందు ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు సీసీ టీవీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్ మాట్లాడటంలో మునిగిపోయిన ఆమె.. మ్యాన్‌హోల్‌ను చూసుకోలేదు. దీంతో ప్రమాదం జరిగింది. నిజానికి.. మ్యాన్ హోల్ తెరిచి ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా అక్కడ ఓ బోర్డు అడ్డుగా పెట్టారు. ఆ బోర్డును గమనించిన ఆ మహిళ.. ముందున్న మ్యాన్ హోల్ ని మాత్రం చూడలేకపోయింది. ఫోన్ లో మాట్లాడుతూ మ్యాన్ హోల్ లోకి జారిపడింది. అయితే, ఆమె అదృష్టం బాగుంది. వెంటనే స్థానికులు వచ్చి కాపాడారు. దీంతో చంటిబిడ్డతో పాటు ఆమె ప్రాణాలు దక్కాయి. లేదంటే ఊహించని ఘోరం జరిగి ఉండేది.
ఫోన్ లో మాట్లాడటం తప్పు కాదు. కానీ, మనం ఎక్కడ ఉన్నాము? ఏం చేస్తున్నాము? అనేది గమనించుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.