Vitamin B12 : విటమిన్ బి12 వల్ల కలిగే ప్రయోజనం తెలుసా?..

కణాల పునరుత్పత్తికి తోడ్పడే ఈ విటమిన్‌ కొత్త చర్మం తయారీకి బి 12 అవసరం. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటుంది.

10TV Telugu News

Vitamin B12 : శరీరానికి అవసరమైన వివిధ రకాల విటమిన్లలో అత్యంత ముఖ్యమైనది బి 12. దీనినే కోబాలమిన్ గా పిలుస్తారు. మనిషి నాడీ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బి 12లోపం ఇటీవలి కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, తినే ఆహారం విషయంలో సరైన అవగాహన లేకపోవటం.

బి 12 లోపిస్తే అనేక వ్యాధుల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. మతిమరుపు, కండరాల బలహీనత, నిస్సత్తువ, నోటిలో పుండ్లు, మూత్రం ఆపుకోలేకపోవటం, శ్వాసలో ఇబ్బందులు, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. విటమిన్ బి12 తక్కువగా ఉండడం వల్ల హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ లెవల్స్ చాలా వరకు పెరుగుతాయి. మెదడు కణాలపై ప్రభావం చూపుతాయి. ఆసమయంలో విటమిన్ బి12 సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు.

శరీరంలోకి చేరిన పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడానికి విటమిన్‌ బి12 అవసరం. ఈ జీవక్రియ ఫలితంగా శక్తి పుంజుకుని, శరీరంలోని నిస్సత్తువ వదులుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు విటమిన్‌ బి12 అవసరం. కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచి, గుండెపోటు, అధిక రక్తపోటులకు గురి కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ బి12 మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారుచేస్తుంది. ఇది రక్తంలో చేరి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను చేరుస్తుంది.

కణాల పునరుత్పత్తికి తోడ్పడే ఈ విటమిన్‌ కొత్త చర్మం తయారీకి బి 12 అవసరం. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే బి12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది. మాంసాహారం నుంచి బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతాయి.

శరీర జీవక్రియల్లో విటమిన్‌ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు బి విటమిన్లకు, ముఖ్యంగా బి 2, బి 12లకు మంచి వనరులు. గుడ్డు సొనలో అధిక మొత్తంలో బి12 ఉంటుంది. అందుకే కేవలం ఎగ్ వైట్‌నే కాకుండా గుడ్డు మొత్తాన్ని ఆహారంలో తీసుకోవాలి. రెండు గుడ్ల నుంచి 1.1 ఎంసీజీ విటమిన్ బి12 అందుతుంది.

దైనందిన జీవితంలోమనం ఎదుర్కొనే ఎక్కువ శాతం ఆరోగ్య సమస్యలకు ఈ విటమిన్‌ లోపమే కారణం. ఆరోగ్య పరిరక్షణలో విటమిన్‌ బి12 ప్రాధాన్యతను గమనించి దాని లోపం లేకుండా చూసుకుంటే ఆరోగ్యవంతమైన జీవనానికి అవకాశం ఉంటుంది.