రాజ్యసభలో రచ్చ రచ్చ, Farm Bills కు ఆమోదం

మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది.
వ్యవసాయ సంస్కరణ బిల్లులను పాస్ చేయించుకోవాలని ఓ వైపు అధికార పార్టీ, అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. దీనిపై
రాజ్యసభలో హాట్ హాట్ చర్చలు జరిగాయి. బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టాయి.
కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున సభ్యులు నినాదాలు చేశారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు ముసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసరడం, టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు.
బిల్లులపై ఓటింగ్ కు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ సహా 11 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినా…బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం సభను 2020, సెప్టెంబర్ 21వ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నట్ల చెప్పారు.