Samyukt Kisan Morcha: రైతుల రుణాలు మాఫీ చేయాలి.. రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: సంయుక్త కిసాన్ మోర్చా

రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గించాలి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు, 2022ను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్‌కేఎమ్‌తో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని గతంలో ప్రభుత్వం వ్రాతపూర్వక హామీ ఇచ్చింది.

Samyukt Kisan Morcha: దేశంలో రైతులందరి రుణాలు మాఫీ చేయాలని, రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.5 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేసింది సంయుక్త కిసాన్ మోర్చా. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) ఆధ్వర్యంలో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించారు. దీనికి దేశ నలుమూలల నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చారు.

Modi The Immortal : చైనాలో ప్రధాని మోదీని ఏమని పిలుస్తారో తెలుసా..? ఏకంగా ముద్దుపేరు పెట్టేశారు..

ఈ సందర్భంగా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని రైతుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తారు. రైతులు, ఆదివాసీ రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, గ్రామీణ కార్మికులు, నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తిపై మహా పంచాయత్‌లో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడారు. 2021 డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చాకి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతు సమస్యలను తగ్గించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.

RRR Team : రాజమౌళి, RRR టీం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి 20 లక్షలు చెల్లించారా?

ఎస్‌కేఎమ్ సంస్థ చేసిన ప్రధాన డిమాండ్లివి… స్వామినాథన్ కమిషన్ సిఫార్సు, హామీ పొందిన సేకరణ ఆధారంగా సీ2+ 50 శాతం ఫార్ములాను ఉపయోగించి అన్ని పంటలకు గరిష్ట మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం తక్షణమే రూపొందించి అమలు చేయాలి. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం ఎస్‌కేఎమ్ ప్రతినిధులను చేర్చడం ద్వారా రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ, గరిష్ట మద్దతు ధరపై మాత్రమే కొత్త కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి. రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గించాలి.

Niharika Konidela : విడాకులు తీసుకోబోతున్న మరో మెగా జంట.. నిజమేనా?

సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు, 2022ను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్‌కేఎమ్‌తో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని గతంలో ప్రభుత్వం వ్రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వ్యవసాయ అవసరాల కోసం, గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికోనియాలో నలుగురు రైతులు, జర్నలిస్టు హత్యకేసులో ప్రధాన సూత్రధారి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్టు చేసి జైలుకు పంపాలి.

రైతు ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలతోపాటు లఖింపూర్ ఖేరీలో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. కరువు, వరదలు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. రైతులు, వ్యవసాయ కూలీలందరికీ నెలకు రూ.5 వేల రైతు పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. రైతు ఉద్యమ సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రైతులపై నమోదైన నకిలీ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. సింగు సరిహద్దు వద్ద అమరులైన రైతుల స్మారక చిహ్నం నిర్మాణానికి భూ కేటాయింపులు చేయాలి.

 

ట్రెండింగ్ వార్తలు