లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం చేసి నిప్పంటించిన తండ్రీకొడుకులు

Father and son raped a woman : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తండ్రీకొడుకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. లిఫ్ట్ అడిగిన పాపానికి ఆమెపై తండ్రీకొడుకులు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటన సీతాపూర్ జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
30 సంవత్సరాల వయసున్న మహిళ అత్తగారిల్లు సిధౌలి నుంచి మిశ్రిక్ వెళ్తుండగా, దారి మధ్యలో కార్ట్ ఫుల్లర్‌పై వెళ్తున్న తండ్రీకుమారుడిని లిఫ్ట్ అడిగింది. ఆమెను బండి ఎక్కించుకున్న వారిద్దరూ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెకు నిప్పంటించారు.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు సీతాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహిళపై అత్యాచారం చేసిన తండ్రి(55)తో పాటు కుమారుడుని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.