Family Responsibilities : ప్యూర్ సినిమా స్టైల్ స్టోరీ.. 10 మంది అక్కల పెళ్లి చేస్తానని ఆస్పత్రి బెడ్ మీద నాన్నకు కొడుకు ప్రామిస్.. కట్ చేస్తే..
Family Responsibilities : తన పదిమంది సోదరీమణుల పెళ్లిళ్లకు తానే స్వయంగా ఏర్పాట్లు చేసి, ఆర్థిక సహాయం అందించాలనేది తన తండ్రి కోరిక అని.. ఆ మేరకు తన ప్రయత్నం కొనసాగుతుందని ఓ యువకుడు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Family Responsibilities : తల్లిదండ్రుల కలను నిజం చేయడానికి, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తమ జీవితాలను అంకితం చేసేవారిని స్పూర్తిదాయకంగా చూడవచ్చు. అలాంటి వ్యక్తికి సంబంధించిన కష్టాల గాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్యూర్ సినిమా స్టైల్ స్టోరీని తలపించే ఈ కథ.. జీవనగమనంలో సగటు భారతీయుడు ఎదుర్కొనే కష్టాలను గుర్తుచేస్తుంది.
తండ్రి ఆస్పత్రి బెడ్ పై ఉన్న సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఓ యువకుడు తన జీవితాన్నే పణంగా పెడుతున్న ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ బాధ్యత, అక్కాచెల్లెళ్లపై ప్రేమ, సమాజపు ఒత్తిళ్లు అన్నీ కలిసిన ఈ కథ సోషల్ మీడియాలో భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.
తాను వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఓ కుటుంబంలో పది మంది సోదరీమణుల తరువాత 11వ సంతానంలో ఆ వ్యక్తి జన్మించాడు. అతని తండ్రి క్యాన్సర్ తో పోరాడుతూ ఆస్పత్రులో చేరాడు. ఈ క్రమంలో తన చిన్న వయస్సులోనే తండ్రి మరణించాడు. తండ్రి చివరి దశలో ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న సమయంలో పది మంది సోదరీమణులకు పెళ్లిళ్లు చేసే బాధ్యతను తీసుకోవాలని కోరాడు. ఆమేరకు యువకుడు తండ్రికి మాట ఇచ్చాడు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం ఆ వ్యక్తి అనేక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు.
తన పదిమంది సోదరీమణుల పెళ్లిళ్లకు తానే స్వయంగా ఏర్పాట్లు చేసి, ఆర్థిక సహాయం అందించాలనేది తన తండ్రి కోరిక అని.. ఆ మేరకు తన ప్రయత్నం కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేసిన అతను మరో ఏడుగురి పెండ్లిళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే, భారతీయ కుటుంబంలో పెండ్లిళ్లు అనేది ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ క్రమంలో ముగ్గురు సోదరీమణుల పెండ్లిళ్లు చేసేందుకు అతను రూ.35లక్షలు అప్పులు చేయాల్సి వచ్చింది.
రాబోయే రోజుల్లో మరో ఏడుగురు సోదరీమణుల పెండ్లిళ్ల కోసం రూ.2 నుంచి 3కోట్ల డబ్బు అవసరం కావచ్చునని అతను అంచనా వేశాడు. ఆమేరకు అప్పుతీసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. మా సోదరీమణుల పెండ్లిళ్లు పూర్తయిన తరువాత ఏమైనా డబ్బు మిగిలితే నేను పెండ్లి చేసుకుంటానంటూ ఆ యువకుడు వీడియో చిరునవ్వుతో చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు..అతని త్యాగాన్ని నిజమైన అన్నప్రేమగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు పెండ్లిళ్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటన భారతీయ కుటుంబాల్లో పెళ్లిళ్ల ఖర్చులు, కుటుంబ బాధ్యతల భారాలు, సామాజిక అంచనాలు ఎంతటి ఆర్థిక ఒత్తిడికి దారితీస్తున్నాయో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
