Family Pension
Family Pension : కుటుంబ పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులు చేసింది. మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కొడుకు, కూతురిని నామినీగా ఎంచుకోవచ్చునని తెలిపింది. గతంలో మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు. ఇంతకముందు వరకు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెనర్షనర్ యొక్క జీవిత భాగస్వామ్యానికి కుటుంబ పెన్షన్ ఇచ్చేవారు. జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణం తరువాత మాత్రమే ఇతర కుటుంబ సభ్యులు అర్హులుగా ఉండేవారు.
ఈ కొత్త నిబంధన వల్ల భర్తతో కలిసి ఉండని, విడాకులు తీసుకున్న మహిళలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి మహిళలు తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చు. నామినీగా భర్తను కాకుండా పిల్లలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఒకవేళ పిల్లలు మైనర్లు అయినా, దివ్యాంగులు అయినా ఆ పెన్షన్ పిల్లల సంరక్షకులకు వెలుతుంది. పిల్లలు మేజర్లు అయిన తరువాత వారు నేరుగా పొందుతారు.
కొత్త రూల్ పై కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధానీ మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. విడాకులు, గృహ హింస, వరకట్నం కేసులు కోర్టులో ఉన్న సమయంలోనూ పింఛను చెల్లింపులో తతల్తె సమస్యసను పరిష్కరించడం సులభం అవుతుందన్నారు.
రాతపూర్వక అభ్యర్థన అవసరం..
తన మరణానంతరం మహిళా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్‌ను చెల్లించాలంటే.. మహిళా ఉద్యోగి సంబంధిత కార్యాలయ అధిపతికి రాతపూర్వక అభ్యర్థన చేయాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థన లేఖలో తప్పనిసరిగా తన భర్త కంటే ముందు కొడుకు లేదా కూతురు కుటుంబ పించన్ ఇవ్వాలని పేర్కొనాలి. ఒకవేళ పిల్లలు లేకుంటే ఆమె భర్తకే పింఛన్ వస్తుంది. లేఖ ప్రకారం ఆమె మరణానంతరం ఫించన్ ను అందిస్తారు.
Also Read: జేడీయూతో దోస్తీ వద్దన్న బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడినట్టు..? కమలం వ్యూహాం ఇదేనా?