Guinness World Record : ఒకే వేదికపై 140 భాషల్లో పాటలు పాడి.. ప్రపంచ రికార్డు సాధించిన సింగర్.. ఎవరో తెలుసా..?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 140 నాలుగు భాషల్లో పాటలు పాడటమంటే? ..కేరళ అమ్మాయి ఈ అరుదైన ఘనతను సాధించి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. ఆమె పాటలు పాడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Guinness World Record

Guinness World Record : దుబాయ్‌లో జరిగిన ఓ సంగీత కచేరిలో సుచేత సతీష్ అనే సింగర్ ఏకంగా 140 భాషల్లో పాటలు పాడారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.

Sandeep Vanga : బాలీవుడ్ రైటర్‌కి సందీప్ వంగ కౌంటర్.. రచయితగా మీరు రాసిందంతా అబద్దం..

కేరళకు చెందిన సుచేత సతీష్ 140 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. నవంబర్ 24, 2023 న దుబాయ్‌లో ‘కాన్సర్ట్ ఫర్ క్లైమేట్’ పేరుతో జరిగిన కచేరిలో సుచేత సతీష్ ఈ అరుదైన ఘనత సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన వీడియోలో సుచేత పాడిన పాటలు వీనుల విందుగా ఉన్నాయి.

Honey Rose : బాబోయ్.. బాలయ్య బాబు హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది? వెరైటీ గెటప్‌లో..

ఒకే ప్రదర్శనలో అత్యధిక భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించడంతో తన పేరును సుస్థిరం చేసుకున్నారు సుచేత. ఆమె సాధించిన రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. ‘UAE దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ఈ అద్భుతమైన విజయం జరిగింది’ అని ఆల్ ఇండియా రేడియో న్యూస్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.