Honey Rose : బాబోయ్.. బాలయ్య బాబు హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది? వెరైటీ గెటప్‌లో..

నటి హనీ రోజ్ న్యూ లుక్ అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది. హాలీవుడ్ నటిలా కనిపిస్తూ కొత్త సంవత్సంలో వైరల్ అవుతున్నారు ఈ నటి.

Honey Rose : బాబోయ్.. బాలయ్య బాబు హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది? వెరైటీ గెటప్‌లో..

Honey Rose

Honey Rose : మళయాళ నటి హనీ రోజ్ ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మాంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్‌గా ఉండే ఈ నటి లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరంలో సరికొత్తగా కనిపిస్తున్న హనీ రోజ్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

Sankranthi Movies : సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏ ఓటీటీకి వస్తున్నాయో తెలుసా..?

2005 లో మళయాళంలో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు హనీ రోజ్. తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. అయితే 2022 లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీర సింహారెడ్డి’తో హనీ రోజ్‌కి మంచి ఫేమ్ వచ్చింది. ఈ నటి ప్రస్తుతం తన కొత్త అవతారంతో వెరైటీగా కనిపిస్తూ వైరల్ అవుతున్నారు.

Vignesh Shivan-Nayanatara : చిక్కుల్లో కోలీవుడ్ కపుల్.. కొత్త సంవత్సరంలో ఇబ్బంది పెడుతున్న వివాదాలు

హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేటెస్ట్ వీడియోలు చూసి అభిమానులు షాకయ్యారు. కొత్త హెయిర్ స్టైల్‌తో ఆరంజ్ కలర్ డ్రెస్‌లో హాలీవుడ్ నటిలా కనిపించారు హనీ రోజ్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో కనిపించకపోయినా ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. హనీ రోజ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని పుకార్లుగా కొట్టిపారేస్తూ తను ఎలాంటి శస్త్ర చికిత్స చేసుకోలేదంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం హనీ రోజ్ ‘తేరీ మేరీ’ అనే మళయాళ సినిమాతో పాటు ‘గాలి బ్రదర్స్’ అనే తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)