Vignesh Shivan-Nayanatara : చిక్కుల్లో కోలీవుడ్ కపుల్.. కొత్త సంవత్సరంలో ఇబ్బంది పెడుతున్న వివాదాలు

కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్-నయనతార దంపతులకు కొత్త ఏడాది చిక్కులు తెచ్చిపెట్టింది. ఇద్దరినీ వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.

Vignesh Shivan-Nayanatara : చిక్కుల్లో కోలీవుడ్ కపుల్.. కొత్త సంవత్సరంలో ఇబ్బంది పెడుతున్న వివాదాలు

Vignesh Shivan-Nayanatara

Updated On : January 7, 2024 / 4:28 PM IST

Vignesh Shivan-Nayanatara : కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్-నయనతార దంపతులను కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వివాదాలు ఇబ్బంది  పెడుతున్నాయి. విఘ్నేష్ టైటిల్ వివాదంలో చిక్కుకుంటే.. నయనతార నటించిన సినిమాపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.

Rishabh Pant : రిష‌బ్‌ పంత్ ఇంట త్వ‌ర‌లో మోగ‌నున్న పెళ్లి బాజాలు.. 9 ఏళ్ల నుంచి ల‌వ్‌..

విఘ్నేశ్ శివన్ 2007 లో నటుడిగా అరంగేట్రం చేసినా 2012 లో ‘పోదా పోడి’ సినిమాతో డైరెక్షర్‌గా ఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తున్న విఘ్నేశ్ తాజాగా తాను డైరెక్ట్ చేయబోతున్న సినిమా టైటిల్ విషయంలో చిక్కుల్లో పడ్డారు. ఇటీవలే విఘ్నేశ్.. ప్రదీప్ రంగనాథన్- కృతి శెట్టి జంటగా ‘ఎల్ఐసీ’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. పూజా కార్యక్రమం కూడా జరిగింది. కాగా ఈ సినిమా టైటిల్ తనదని 8 సంవత్సరాల క్రితం తాను రిజిస్టర్ చేసుకున్నానని కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ వెల్లడించారు. టైటిల్ మార్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

అదలాఉంటే ఇదే టైటిల్ మీద విఘ్నేశ్ శివన్‌కి ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ నోటీసులు జారీ చేసింది. ప్రజల్లో తమ సంస్థకు ఉన్న ఇమేజ్‌కి డ్యామేజీ కలిగించవద్దని పేర్కొంది. వారంలోపు పేరు మార్చకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక విఘ్నేశ్ ఈ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Hanuman : మూడేళ్ళ క్రిందటే చిరంజీవి.. ‘హనుమాన్’ సినిమా గురించి చెప్పారా.. వీడియో వైరల్

మరోవైపు విఘ్నేశ్ శివన్ భార్య నటి నయనతార ఇటీవల నటించిన మూవీ ‘అన్నపూరణి’ విషయంలో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ సినిమా డిసెంబర్ 1, 2023 లో రిలీజైంది. ప్రస్తుతం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా శ్రీరాముడిని కించపరిచేలా, లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని ఆరోపిస్తూ మాజీ శివసేన లీడర్ రమేష్ సోలంకి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ సినిమా డైరెక్టర్ నీలేష్ కృష్ణ, నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ వివాదాల నుండి విఘ్నేశ్ శివన్-నయనతార జంట బయటపడతారా? లేక క్రిమినల్ చర్యలు తప్పవా? అనేది వేచి చూడాలి.