ఢిల్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం(మార్చి-30,2021)కశ్మీరీ గేట్ వద్ద నున్న అంతర్రాష్ట్ర బస్సు టెర్నినల్​(ISBT)లోని ఆరో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది.

ఢిల్లీలో అగ్నిప్రమాదం

Fire Breaks Out In Delhi Slum Cluster No Injuries

Updated On : March 30, 2021 / 7:00 PM IST

Fire Breaks Out In Delhi ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం(మార్చి-30,2021)కశ్మీరీ గేట్ వద్ద నున్న అంతర్రాష్ట్ర బస్సు టెర్నినల్​(ISBT)లోని ఆరో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని 6వ అంతస్తు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇదే బిల్డింగ్ లో ఢిల్లీ ప్రభుత్వపు కుటుంబ మరియు సంక్షేమ శాఖ కార్యాలయం ఉంది.

Kashmere Gate Fire

Kashmere Gate Fire

అగ్నిప్రమాదం నేపథ్యంలో బిల్డింగ్ మొత్తాన్ని ఖాళీ చేయించారు అధికారులు. మంటలను ఆర్పేందుకు 9 ఫైరింజన్లు స్పాట్ కి చేరుకున్నాయి. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే,మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని,అందరూ సేఫ్ గా ఉన్నారని అధికారులు తెలిపారు.