South Mumbai : రెసిడెన్షియ‌ల్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి

ద‌క్షిణ ముంబైలోని లాల్ బగ్ ఏరియాలోని అవిగ్న పార్క్ సొసైటిలో ఉన్న రెసిడెన్షియ‌ల్ అపార్ట్‌మెంట్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్ర‌మాదం సంభవించింది. బిల్డింగ్ లోని 19వ అంత‌స్తులో మంట‌లు వ్యాపించ

South Mumbai : రెసిడెన్షియ‌ల్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి

Mumbai

Updated On : October 22, 2021 / 1:33 PM IST

South Mumbai    ద‌క్షిణ ముంబైలోని లాల్ బగ్ ఏరియాలోని అవిగ్న పార్క్ సొసైటిలో ఉన్న 60 అంతస్థుల రెసిడెన్షియ‌ల్ అపార్ట్‌మెంట్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్ర‌మాదం సంభవించింది. బిల్డింగ్ లోని 19వ అంత‌స్తులో మంట‌లు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మంటలనుంచి తప్పించుకునే ప్రయత్నంలో 30 ఏళ్ల వ్యక్తి బిల్డింగ్ పైనుంచి జారి కిందపడి మరణించాడు.

ఇక, మంట‌ల్ని ఆర్పేందుకు అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు 14 ఫైరింజన్లు అవిగ్న పార్క్ సొసైటికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్,రెస్క్యూ డిపార్ట్మెంట్ అధికారులు స్పాట్ కి చేరుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు,నష్టం గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

ALSO READ Odisha Congress : ఒడిషాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా