Site icon 10TV Telugu

Firing incident Video: బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో కొట్టుకున్న నేతలు… కాల్పులు..

Chaos ensued at the event of BJP

Chaos ensued at the event of BJP

Firing incident Video – Bihar: బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య గొడవ చెలరేగింది. చివరకు ఓ బీజేపీ నేత తుపాకీ తీసి కాల్పులు జరిపారు. దీంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బిహార్ లోని మాధేపురా (Madhepura) జిల్లా మురళీగంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ ఇవాళ ఆ ప్రాంతంలో పార్టీ తరఫున ఓ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీలోని రెండు గ్రూపుల వారు హాజరై గొడవపడ్డారు. పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. బీజేపీ నేత పంకజ్ కుమార్ పటేల్ తుపాకీ తీసి కాల్చారు. దీంతో సంజయ్ కుమార్ భగత్ అనే నేత గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంకజ్ కుమార్ పటేల్ ను అరెస్టు చేశారు. ఆత్మరక్షణ కోసమే తాను కాల్పులు జరిపానని ఆయన అన్నారు. డబ్బుల విషయంపైనే బీజేపీలోని రెండు గ్రూపులు గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అంతా కెమెరాలో రికార్డయింది.

 

Road Accident : హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి..

Exit mobile version