Road Accident : హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి..

మృతులు వెల్డండి సాంబరాజు (40) వెల్దండి ఆకాంక్ష, లక్ష్మిప్రసన్న (9), అనుమూల నరసింహస్వామిగా గుర్తించారు.

Road Accident : హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి..

Road Accident

Updated On : June 25, 2023 / 7:48 PM IST

Road Accident – Hanamkonda: హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు నుజ్జు నుజ్జు అయింది.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతులు వెల్డండి సాంబరాజు (40) వెల్దండి ఆకాంక్ష, లక్ష్మిప్రసన్న (9), అనుమూల నరసింహస్వామిగా గుర్తించారు. వారంతా మేడారం వెళ్లివస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణించారని, వారంతా వరంగల్ కాశిబుగ్గకు చెందిన వారిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందుతుందని వివరించారు.

తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డి కాలనీలో ఆగి ఉన్న ట్రాక్టర్ ను జీపు ఢీ కొట్టింది. దీంతో 15 మందికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాళేశ్వరం నుంచి జీపు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

IIT Kanpur : ప్లాస్టిక్ కన్నా యమ డేంజర్.. థర్మాకోల్ సమస్యకు అద్భుత పరిష్కారం చెప్పిన కాన్పూర్ ఐఐటీ