దేశంలో ఫస్ట్ టైమ్ : 3 చింపాంజీలు, 4 కోతులను అటాచ్ చేసిన ఈడీ

టైటిల్ చూసి షాక్ అయ్యారా. చింపాంజీలను, కోతులను ఈడీ అటాచ్ చెయ్యడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. కానీ ఇది నిజం. ఇప్పటివరకు ఆస్తులను మాత్రమే అటాచ్ చేసిన

  • Published By: veegamteam ,Published On : September 22, 2019 / 02:46 AM IST
దేశంలో ఫస్ట్ టైమ్ : 3 చింపాంజీలు, 4 కోతులను అటాచ్ చేసిన ఈడీ

Updated On : September 22, 2019 / 2:46 AM IST

టైటిల్ చూసి షాక్ అయ్యారా. చింపాంజీలను, కోతులను ఈడీ అటాచ్ చెయ్యడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. కానీ ఇది నిజం. ఇప్పటివరకు ఆస్తులను మాత్రమే అటాచ్ చేసిన

టైటిల్ చూసి షాక్ అయ్యారా. చింపాంజీలను, కోతులను ఈడీ అటాచ్ చెయ్యడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. కానీ ఇది నిజం. ఇప్పటివరకు ఆస్తులను మాత్రమే అటాచ్ చేసిన ఈడీ.. ఫస్ట్ టైమ్ జంతువులను  అటాచ్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తొలిసారి రూ.81 లక్షల విలువైన జంతువులను అటాచ్ చేశారు. వీటిలో 3 చింపాంజీలు, 4 మార్మోసెట్లు (పొడవాటి తోక కలిగిన కోతులు) ఉన్నాయి. ఒక్కో  చింపాంజీ విలువ రూ.25 లక్షలు. ఒక్కో మార్మోసెట్ విలువ రూ.1.5 లక్షలని ఈడీ అధికారులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే వెస్ట్ బెంగాల్ కి చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌ సుప్రదీప్ గుహపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ చింపాజీలు, కోతులను అటాచ్‌ చేసింది. స్మగ్లర్‌ ఇంటి నుంచి వాటిని  స్వాధీనం చేసుకున్నారు. సుప్రదీప్ గుహ.. అటవీ అధికారుల ఫోర్జరీ డాక్యుమెంట్లతో జంతువుల అక్రమ రవాణా దందా నిర్వహిస్తున్నాడు. జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు వెస్ట్ బెంగాల్ అటవీశాఖ ప్రిన్సిపల్  చీఫ్ కన్జర్వేటర్ (పీసీసీఎఫ్), వైల్డ్‌ లైఫ్, చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్ నుంచి అనుమతులు తీసుకున్నట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు అధికారులు తెలిపారు.
 
మనీలాండరింగ్ కేసు కింద సుప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. అతడు పెద్ద ఎత్తున అటవీ జంతువులను స్మగ్లింగ్ చేసే రాకెట్ నడుపుతున్నట్టు తెలిసి  అధికారులు విస్తుపోయారు. కస్టమ్స్, అటవీ చట్టాల నుంచి తప్పించుకునేందుకు గుహ చాలా తెలివిగా సమాధానాలు చెప్పేవాడని ఈడీ అధికారులు తెలిపారు. గుహ నుంచి స్వాధీనం చేసుకున్న జంతువులను  అధికారులు అలీపోర్ జూకు తరలించారు. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి మంచి ఆదాయ మార్గం అవుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్‌ చట్టం కింద  జంతువులను అటాచ్‌ చేయడం ఇదే మొదటిసారి అని ఈడీ తెలిపింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించినందుకు స్మగ్లర్‌ సుప్రదీప్‌ గుహపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

Also Read : వాళ్లకు దేశంలో నివసించే హక్కులేదు…హర్యానా సీఎం హెచ్చరిక